NEET: అందుకే టెలిగ్రామ్ యాప్ బ్యాన్.. నీట్ రీ-ఎగ్జామ్ వేళ వెలుగులోకి సంచలన నిజం
NEET: జూన్ 21న జరగనున్న నీట్ యూజీ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
NEET: అందుకే టెలిగ్రామ్ యాప్ బ్యాన్.. నీట్ రీ-ఎగ్జామ్ వేళ వెలుగులోకి సంచలన నిజం
NEET: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్షా పత్రాల లీకేజీ వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 21, 2026న జరగనున్న నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు వీలుగా.. ప్రముఖ మెసేజింగ్ యాప్ 'టెలిగ్రామ్' యాక్సెస్‌పై జూన్ 22 వరకు తాత్కాలిక బ్యాన్ విధిస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో టెలిగ్రామ్ వేదికగా భారీ ఎత్తున చీటింగ్ ముఠాలు, సైబర్ మోసాలు చెలరేగడమే ఈ బ్యాన్‌కు ప్రధాన కారణం.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం.. 'PAPER LEAKED NEET', 'Re-NEET 2026', 'Private Mafia' లాంటి పేర్లతో టెలిగ్రామ్‌లో అనేక గ్రూపులు ఏర్పాటయ్యాయి. నీట్ క్వశ్చన్ పేపర్ తమ దగ్గర ఉందని నమ్మించి, విద్యార్థుల నుంచి కొన్ని వేల నుంచి లక్షల రూపాయల వరకు ఈ ముఠాలు డిమాండ్ చేశాయి. వాస్తవానికి అలాంటి పేపర్ బయట ఎక్కడా లేదని, ఇదంతా పూర్తిగా మోసమని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. టెలిగ్రామ్‌లో ఉన్న మెసేజ్ ఎడిట్ ఆప్షన్‌ను ఈ ముఠాలు తమకు అనుకూలంగా వాడుకున్నాయి. ముందుగా గ్రూపులో ఏదో ఒక సాధారణ మెసేజ్ పెట్టి, పరీక్ష పూర్తయిన తర్వాత ఆ పాత మెసేజ్‌ను ఎడిట్ చేసి అసలు క్వశ్చన్ పేపర్ పీడీఎఫ్‌ను అందులో జత చేస్తున్నారు.
దీనివల్ల టైమ్ స్టాంప్ పాతదే ఉండటంతో, పరీక్షకు ముందే పేపర్ లీక్ అయినట్లుగా ఫేక్ స్క్రీన్‌షాట్లు సృష్టించి తప్పుదోవ పట్టించారు. దీనికి అడ్డుకట్ట వేయడానికి జూన్ 30 వరకు ఇండియాలో టెలిగ్రామ్ 'ఎడిట్' ఫీచర్‌ను డిసేబుల్ చేయాలని కూడా ఐటీ చట్టం సెక్షన్ 69A కింద కేంద్రం ఆదేశించింది. కాగా, జూన్ 21న జరగాల్సిన రీ-ఎగ్జామ్‌ను పారదర్శకంగా నిర్వహించడానికి ప్రభుత్వ నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుందని, దీనిని తాము స్వాగతిస్తున్నామని ఎన్‌టీఏ ప్రకటించింది. కాబట్టి విద్యార్థులు సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ పేపర్లను నమ్మవద్దని అధికారులు సూచిస్తున్నారు.




