Woman Techie: తొక్కలో IT జాబ్ ఎవడిక్కావాలి.. టెన్షన్ లేకుండా నెలకు రూ.60 వేలు వస్తుంటే

Woman Techie: కార్పొరేట్ ప్రపంచంలోని మితిమీరిన పని ఒత్తిడి, మానసిక ఆందోళనలను భరించలేక సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి స్వస్తి పలికి.. ఆటో డ్రైవర్‌గా మారిన మహిళ.

Naresh.k
Published on: 1 Jun 2026 1:57 PM IST
Woman Techie
X

Woman Techie: తొక్కలో IT జాబ్ ఎవడిక్కావాలి.. టెన్షన్ లేకుండా నెలకు రూ.60 వేలు వస్తుంటే

Software Engineer: లక్షల జీతం.. ఏసీ రూమ్.. సమాజంలో మంచి హోదా. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అంటే ఎవరికైనా ఉండే క్రేజ్ ఇది. కానీ, ఆ రంగుల ప్రపంచం వెనుక ఉండే నరకం లాంటి పని ఒత్తిడిని భరించలేక ఓ మహిళా టెక్కీ ఊహించని నిర్ణయం తీసుకుంది. కార్పొరేట్ లైఫ్‌కు గుడ్ బై చెప్పేసి.. చేతిలోకి ఆటో స్టీరింగ్ పట్టింది. ప్రస్తుతం ప్రశాంతంగా జీవిస్తూ.. నెలకు ఏకంగా 60,000 రూపాయలు సంపాదిస్తూ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది.

సదరు మహిళ ఒకప్పుడు ఐటీ రంగంలో మంచి పొజిషన్‌లో, చేతినిండా జీతంతో లగ్జరీ లైఫ్ గడిపింది. అయితే పైకి అంతా బాగున్నట్లు కనిపించినా.. లోపల మాత్రం మితిమీరిన పని ఒత్తిడి ఆమె వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా దెబ్బతీసింది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లోపించడం, రోజురోజుకూ పెరుగుతున్న డెడ్‌లైన్స్ ఆమె మానసిక ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపించాయి. ఎంత డబ్బు సంపాదించినా ప్రశాంతత కరువైందని భావించిన ఆమె.. ఒకరోజు ఒక గట్టి నిర్ణయానికి వచ్చింది. ఆ బంధనాల కార్పొరేట్ ఉద్యోగానికి శాశ్వతంగా స్వస్తి పలికింది.

ఉద్యోగం మానేసిన తర్వాత మళ్లీ ఎవరి కిందో బాస్ అనిపించుకోవడం ఆమెకు ఇష్టం లేదు. సొంతంగా, స్వేచ్ఛగా బతకాలని భావించి ఏకంగా ఆటో నడపడం ప్రారంభించింది. ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆటో నడపడం ఏంటని మొదట్లో సమాజం నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ.. ఆమె మాత్రం వెనకడుగు వేయలేదు. తన నిర్ణయాన్ని నమ్మి ముందడుగు వేసింది.

ప్రస్తుతం ఆమె రోజూ రోడ్లపై ఆటో నడుపుకుంటూ.. ఎలాంటి కార్పొరేట్ ఒత్తిడి లేకుండా, పూర్తి స్వేచ్ఛతో తన జీవితాన్ని తానే డిజైన్ చేసుకుంటోంది. పైగా ఆర్థికంగా కూడా ఆమె ఏమాత్రం నష్టపోలేదు. ఆటో నడపడం ద్వారా ప్రస్తుతం నెలకు దాదాపు రూ.60,000 వరకు సంపాదిస్తూ గౌరవంగా జీవనం సాగిస్తోంది. బాస్ గొడవ లేదు.. లాప్‌టాప్ డెడ్‌లైన్స్ లేవు.. లాగిన్ టైమ్ అంతకంటే లేదు. నాకు నచ్చినప్పుడు ఆటో తీస్తా.. నచ్చినంత సంపాదిస్తా.. నా జీవితానికి నేనే బాస్ అనే రేంజ్‌లో ఆమె లైఫ్ సాగిపోతోంది.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story