JEE Main 2026 Results: రేపే జేఈఈ మెయిన్ 2026 ఫలితాలు.. స్కోర్ కార్డ్ డౌన్‌లోడ్ లింక్ ఇదే!
JEE Main 2026 Session 2 Results: జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 ఫలితాలను ఎన్టీఏ సోమవారం విడుదల చేయనుంది.
JEE Main 2026 Session 2 Results
JEE Main 2026 Session 2 Results: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జేఈఈ మెయిన్ 2026 (JEE Main 2026) సెషన్ 2 ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈ ఫలితాలను రేపు, అంటే సోమవారం (ఏప్రిల్ 20న) అధికారికంగా విడుదల చేయనుంది.
హాజరైన వారు: ఈ ఏడాది సెషన్ 2 పరీక్షలకు దేశవిదేశాల్లోని 318 కేంద్రాల నుండి దాదాపు 11.23 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
పరీక్షా తేదీలు: ఏప్రిల్ 2 నుండి 8 వరకు ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్షలు జరిగాయి.
తుది ఫలితాలు: సెషన్ 1 మరియు సెషన్ 2లలో అభ్యర్థులు సాధించిన అత్యుత్తమ స్కోరు ఆధారంగా ఆల్ ఇండియా ర్యాంకులను (AIR) కూడా రేపు ప్రకటించే అవకాశం ఉంది.
ఫలితాలను ఎలా తనిఖీ చేయాలి?
♦ అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in సందర్శించాలి.
♦ హోమ్ పేజీలో కనిపించే 'JEE Main 2026 Session 2 Results' లింక్‌పై క్లిక్ చేయాలి.
♦ మీ అప్లికేషన్ నంబర్ మరియు పుట్టిన తేదీ (DOB) వివరాలను ఎంటర్ చేయాలి.
♦ స్కోర్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది, భవిష్యత్తు అవసరాల కోసం దానిని ప్రింట్ తీసుకోవాలి.
ఈ ఫలితాల ఆధారంగా టాప్ 2.5 లక్షల మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ (JEE Advanced) పరీక్షకు అర్హత సాధిస్తారు.




