JEE Main 2027 Syllabus: జేఈఈ మెయిన్ సిలబస్ విడుదల చేసిన ఎన్టీఏ.. పరీక్షల షెడ్యూల్, దరఖాస్తు తేదీలు ఇవే!

JEE Main 2027 Syllabus: జేఈఈ మెయిన్ సిలబస్‌ను ఎన్టీఏ విడుదల చేసింది. ఫిజిక్స్, కెమిస్ట్రీలో 20, మ్యాథ్స్‌లో 14 యూనిట్లు ఖరారు చేశారు.

Arun Chilukuri
Published on: 26 Oct 2026 12:34 PM IST
JEE Main 2027 Syllabus
X

JEE Main 2027 Syllabus: జేఈఈ మెయిన్ సిలబస్ విడుదల చేసిన ఎన్టీఏ.. పరీక్షల షెడ్యూల్, దరఖాస్తు తేదీలు ఇవే!

JEE Main 2027 Syllabus: దేశంలో అత్యంత కీలకమైన ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్ (JEE Main) సిలబస్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారికంగా విడుదల చేసింది. అభ్యర్థుల సౌకర్యార్థం సబ్జెక్టుల వారీగా యూనిట్లను ఖరారు చేస్తూ ఈ ప్రకటన విడుదల చేసింది.

సబ్జెక్టుల వారీగా యూనిట్ల వివరాలు:

ఫిజిక్స్ (Physics): 20 యూనిట్లు

కెమిస్ట్రీ (Chemistry): 20 యూనిట్లు

గణితం (Mathematics): 14 యూనిట్లు

దరఖాస్తు గడువు మరియు ప్రాసెస్:

జేఈఈ మెయిన్ సెషన్-1 కు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

చినవంబర్ 22 వరకు అభ్యర్థులు సాధారణ రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుముతో నవంబర్ 23 నుంచి నవంబర్ 26 వరకు ఆలస్య రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకునేందుకు ఎన్టీఏ అవకాశం కల్పించింది.

జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలు జనవరి 20, 21, 22, 23, 24 మరియు 28 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఎన్టీఏ స్పష్టం చేసింది. అర్హత కలిగిన విద్యార్థులు నిర్దేశిత సమయం లోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.