Labour codes: ఇకపై వారానికి 4 రోజులే పని, 3 రోజులు సెలవు.. ఇది నిజంగానే సాధ్యమా.?

Labour codes: కొత్త లేబర్ కోడ్ నిబంధనల ప్రకారం పని విధానంలో పెద్ద మార్పులు రావచ్చు.

Mokshith
Published on: 20 May 2026 1:26 PM IST
Labour codes
X

Labour codes: ఇకపై వారానికి 4 రోజులే పని, 3 రోజులు సెలవు.. ఇది నిజంగానే సాధ్యమా.?

Labour codes: కొత్త లేబర్ కోడ్ నిబంధనల ప్రకారం పని విధానంలో పెద్ద మార్పులు రావచ్చు. వారానికి కేవలం 4 రోజులు మాత్రమే ఆఫీస్‌కు వెళ్లి, వరుసగా 3 రోజులు సెలవు పొందే అవకాశం ఉంది. అయితే దీనికి కొన్ని షరతులు కూడా ఉన్నాయి. ఈ కొత్త వ్యవస్థ ఎలా ఉండ‌నుందో ఇప్పుడు తెలుసుకుందాం.

వారానికి 4 రోజులు పని – కొత్త వర్క్ మోడల్

కొత్త నిబంధనల ప్రకారం ఉద్యోగులు వారానికి 4 రోజులు మాత్రమే పని చేయవచ్చు. మిగతా 3 రోజులు వరుసగా సెలవులు ఉంటాయి. అంటే ఉద్యోగులకు ఎక్కువ విశ్రాంతి సమయం లభిస్తుంది. దీని వల్ల వర్క్-లైఫ్ బ్యాలెన్స్ మెరుగుపడే అవకాశం ఉంది. అయితే ఇది తప్పనిసరి నియమం కాదు, కంపెనీ ఇష్టానికి అనుగుణంగా అమలు చేయవచ్చు.

రోజుకు 12 గంటల షిఫ్ట్ తప్పనిసరి

4 రోజుల పని విధానం ఎంచుకుంటే, రోజుకు పని గంటలు పెరుగుతాయి. వారానికి మొత్తం 48 గంటల పని పరిమితి కొనసాగుతుంది. అందుకే ఉద్యోగులు రోజుకు సుమారు 12 గంటలు పని చేయాల్సి ఉంటుంది. ఇందులో బ్రేక్ టైమ్ కూడా కలిపి ఉంటుంది. అంటే తక్కువ రోజులు పని చేసినా, రోజువారీ పని భారం ఎక్కువగా ఉంటుంది.

ఈ కొత్త రూల్ తప్పనిసరి కాదు

ఈ వ్యవస్థను అన్ని కంపెనీలు తప్పనిసరిగా అమలు చేయాల్సిన అవసరం లేదు. ఉద్యోగి, కంపెనీ ఇద్దరూ అంగీకరిస్తేనే ఇది అమలులోకి వస్తుంది. అంటే ఇది ఒక ఆప్షనల్ వర్క్ మోడల్ మాత్రమే. ఉద్యోగులకు నచ్చితేనే ఈ విధానం కొనసాగుతుంది.

ఓవర్‌టైమ్, వేతన నిబంధనలు

కొత్త లేబర్ కోడ్‌లో ఓవర్‌టైమ్‌పై కూడా కఠిన నియమాలు ఉన్నాయి. వారానికి 48 గంటలకు మించి పని చేయిస్తే, ఆ అదనపు గంటలకు రెట్టింపు వేతనం చెల్లించాలి. ఇది ఉద్యోగులకు అదనపు రక్షణగా ఉంటుంది. అలాగే పని గంటల లెక్కను రోజువారీ కాకుండా వారాంతంలో మొత్తం గంటల ఆధారంగా లెక్కిస్తారు.

ఏ రంగాలకు ఉపయోగం, ఏ రంగాలకు కష్టం?

ఈ కొత్త మోడల్ ముఖ్యంగా ఐటీ, ఐటీఈఎస్, డిజైన్, మార్కెటింగ్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ వంటి నాలెడ్జ్ ఆధారిత రంగాలకు బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ పని ప్రాజెక్ట్ ఆధారంగా ఉంటుంది కాబట్టి ఫ్లెక్సిబిలిటీ సులభం.

అయితే హెల్త్‌కేర్, హోటల్స్, రిటైల్, ట్రాన్స్‌పోర్ట్, మాన్యుఫ్యాక్చరింగ్ వంటి రంగాల్లో ఇది అమలు చేయడం కష్టం. ఎందుకంటే అక్కడ నిరంతర సేవలు అవసరం ఉంటుంది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story