NHAI Internship 2026: NHAIలో ఇంటర్న్‌షిప్.. నెలకు రూ. 20 వేల స్టైపెండ్! ఇలా అప్లై చేయండి
NHAI Internship 2026: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) సమ్మర్ ఇంటర్న్‌షిప్ 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
NHAI Internship 2026
NHAI Internship 2026: కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI), విద్యార్థుల కోసం ‘సమ్మర్ ఇంటర్న్‌షిప్ 2026’ కార్యక్రమాన్ని ప్రకటించింది. జాతీయ రహదారుల నిర్మాణ రంగంలో అనుభవం పొందాలనుకునే యువతకు ఇది ఒక సువర్ణావకాశం. ఈ శిక్షణలో భాగంగా ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 20,000 స్టైపెండ్ అందించనున్నారు.
అర్హతలు ఇవే:
ఈ ఇంటర్న్‌షిప్‌కు ఫుల్‌టైమ్ యూజీ (UG), పీజీ (PG) చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంజనీరింగ్: సివిల్, ఎలక్ట్రికల్, ఐటీ, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఏఐ (AI).
ఇతర కోర్సులు: మేనేజ్‌మెంట్ (MBA), లా (BA LLB), కామర్స్ (B.Com), సైన్స్ (B.Sc), మాస్ కమ్యూనికేషన్ మరియు లైబ్రరీ సైన్స్ విద్యార్థులు కూడా అర్హులు.
ముఖ్యమైన వివరాలు:
శిక్షణ కాలం: మే 4, 2026 నుంచి జూలై 5, 2026 వరకు (సుమారు రెండు నెలలు).
పని ప్రదేశం: దేశవ్యాప్తంగా ఉన్న NHAI ఫీల్డ్ ఆఫీసులు లేదా ప్రధాన కార్యాలయంలో సీనియర్ అధికారుల పర్యవేక్షణలో ప్రాజెక్టులపై పని చేయాల్సి ఉంటుంది.
ప్రయోజనాలు: నెలకు రూ. 20,000 స్టైపెండ్‌తో పాటు, విజయవంతంగా పూర్తి చేసిన వారికి అధికారిక సర్టిఫికేట్ అందజేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
♦ అధికారిక పోర్టల్ internshipsatnhai.digitalindiacorporation.in సందర్శించాలి.
♦ వ్యక్తిగత, అకడమిక్ వివరాలతో పాటు ప్రాధాన్యత గల ప్రాజెక్ట్ లొకేషన్‌ను ఎంచుకోవాలి.
♦ మీ విద్యా సంస్థ (College/University) నుంచి ఆమోదం పొందిన దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.
ముగింపు తేదీ:
ఆన్‌లైన్ దరఖాస్తులకు ఏప్రిల్ 15, 2026 చివరి తేదీగా నిర్ణయించారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు NHAI అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.




