Special TGTET Hall Tickets 2026: తెలంగాణ టీచర్లకు అలర్ట్.. స్పెషల్ టీజీటెట్ హాల్ టికెట్లు వచ్చేశాయ్!

Special TGTET Hall Tickets 2026: తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ‘స్పెషల్ టీజీటెట్ (TGTET)-ఇన్‌సర్వీస్ టీచర్స్-2026-II’ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను విడుదల చేసింది.

Arun Chilukuri
Published on: 18 Nov 2026 12:49 PM IST
Special TGTET Hall Tickets 2026
X

 Special TGTET Hall Tickets 2026: తెలంగాణ టీచర్లకు అలర్ట్.. స్పెషల్ టీజీటెట్ హాల్ టికెట్లు వచ్చేశాయ్!

Special TGTET Hall Tickets 2026: తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ‘స్పెషల్ టీజీటెట్ (TGTET)-ఇన్‌సర్వీస్ టీచర్స్-2026-II’ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను విడుదల చేసింది. మంగళవారం (నవంబర్ 17) నుంచి పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఈ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,586 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నవంబర్ 22న ఈ పరీక్ష జరగనుంది.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నిర్వహించే విద్యాశాఖ డిపార్ట్‌మెంటల్ పరీక్షతో తేదీలు క్లాష్ అవ్వడంతో, స్పెషల్ టీజీటెట్ పరీక్షను నవంబర్ 22కు వాయిదా వేశారు. దీనికనుగుణంగా హాల్ టికెట్ల విడుదల తేదీని కూడా నవంబర్ 17కు మార్చారు. అంతేకాకుండా, పరీక్ష సెషన్ల క్రమంలోనూ విద్యాశాఖ కీలక మార్పులు చేసింది:

ఉదయం సెషన్ (పేపర్-II): మారిన షెడ్యూల్ ప్రకారం పేపర్-2 పరీక్ష ఉదయం సెషన్‌లో 9:00 గంటల నుంచి 11:30 గంటల వరకు జరగనుంది. ఈ పేపర్‌కు మొత్తం 7,995 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

మధ్యాహ్నం సెషన్ (పేపర్-I): పేపర్-1 పరీక్ష మధ్యాహ్నం 2:00 గంటల నుంచి 4:30 గంటల వరకు నిర్వహించనున్నారు. దీనికి 2,591 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.

మారిన పరీక్ష సమయాలకు అనుగుణంగానే హాల్ టికెట్లను జారీ చేసినట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది. అభ్యర్థులు తమ లాగిన్ వివరాలను (Login Credentials) ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.