Telangana Inter Admissions 2026: ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల.. ఈసారి GPA మాత్రమే కీలకం!
Telangana Inter Admissions 2026: తెలంగాణ ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్ 2026 విడుదలైంది. మే 8 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది.
Telangana Inter Admissions 2026: ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల.. ఈసారి GPA మాత్రమే కీలకం!
TG Intermediate Admissions 2026-27: తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ కళాశాలల్లో 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రవేశాల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. పదో తరగతి ఫలితాల అనంతరం పైచదువుల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల కోసం కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది.
ముఖ్యమైన తేదీలు ఇవే:
అడ్మిషన్ల ప్రారంభం: మే 8, 2026
దరఖాస్తుల గడువు: మే 31, 2026
తరగతుల ప్రారంభం: జూన్ 1, 2026
అడ్మిషన్ల నిబంధనలు & బోర్డు కీలక సూచనలు:
ఇంటర్ బోర్డు ఈసారి ప్రవేశాల ప్రక్రియలో పారదర్శకత కోసం పలు కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చింది.
GPA ఆధారంగా ప్రవేశాలు: ఇంటర్ ప్రవేశాలను కేవలం పదో తరగతిలో సాధించిన GPA (Grade Point Average) ఆధారంగానే చేపట్టాలని బోర్డు స్పష్టం చేసింది.
సెక్షన్ పరిమితి: ప్రతి సెక్షన్‌లో గరిష్టంగా 88 మంది విద్యార్థులకు మాత్రమే అనుమతి ఉంటుంది. అంతకు మించి విద్యార్థులను చేర్చుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది.
ఆధార్ తప్పనిసరి: అడ్మిషన్ పొందే సమయంలో విద్యార్థి యొక్క ఆధార్ కార్డు సమర్పించడం తప్పనిసరి.
ప్రైవేట్ కాలేజీలకు ఆదేశం: ప్రైవేట్ జూనియర్ కళాశాలలు తమ వద్ద ఉన్న ఖాళీ సీట్ల వివరాలను ప్రతిరోజూ నోటీసు బోర్డులో ప్రదర్శించాలి.
గుర్తింపు పొందిన కాలేజీలే లక్ష్యం: విద్యార్థులు మరియు తల్లిదండ్రులు కేవలం బోర్డు గుర్తింపు ఉన్న కాలేజీల్లోనే అడ్మిషన్లు తీసుకోవాలని, అనధికారిక సంస్థల బారిన పడవద్దని అధికారులు సూచించారు.
ఈ అడ్మిషన్ల ప్రక్రియ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ మరియు రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.




