Telangana 10th Results 2026: వేగంగా టెన్త్ వాల్యుయేషన్.. రిజల్ట్స్ అప్‌డేట్ వచ్చేసింది..!
Telangana 10th Results 2026: తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదలకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. మే మొదటి వారంలోనే రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది.
Telangana 10th Results 2026: వేగంగా టెన్త్ వాల్యుయేషన్.. రిజల్ట్స్ అప్‌డేట్ వచ్చేసింది..!
Telangana 10th Results 2026: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థులకు విద్యాశాఖ ముఖ్య గమనికను అందించింది. నిన్నటితో రాష్ట్రవ్యాప్తంగా టెన్త్ పరీక్షలు ముగియగా, ఫలితాలను వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం.. మే మొదటి వారంలోనే పదో తరగతి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
ఈ ఏడాది విద్యాశాఖ పరీక్షల నిర్వహణతో పాటు సమాంతరంగా జవాబు పత్రాల మూల్యాంకనాన్ని (Valuation) ప్రారంభించింది. దీనివల్ల ఫలితాల విడుదలకు సమయం ఆదా అవుతోంది. ఇప్పటికే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ సబ్జెక్టులకు సంబంధించిన వాల్యుయేషన్ పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సైన్స్, సోషల్ సబ్జెక్టుల మూల్యాంకనంతో పాటు స్కానింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
ఏప్రిల్ 25 నాటికి క్లియర్!
ఈ ప్రక్రియ మొత్తం ఈ నెల (ఏప్రిల్) 25వ తేదీ లోపు పూర్తి చేయాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అదే జరిగితే, మే మొదటి వారంలోనే ఫలితాలను అధికారికంగా వెల్లడించనున్నారు. ఇప్పటికే ఇంటర్ ఫలితాలు విడుదల కావడంతో, ఇప్పుడు అందరి దృష్టి పదో తరగతి ఫలితాలపైనే నెలకొంది. పరీక్షలు ముగిసిన కొద్ది రోజుల్లోనే రిజల్ట్స్ వచ్చేలా పకడ్బందీగా అడుగులు వేస్తుండటం విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఊరటనిచ్చే అంశం.




