TG Inter Academic Calendar 2026-27: ఇంటర్ పరీక్షలు, దసరా, సంక్రాంతి సెలవుల తేదీలు ఇవే.. బోర్డు కీలక ప్రకటన!

TG Inter Academic Calendar 2026-27: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది.

Arun Chilukuri
Published on: 31 March 2026 11:15 AM IST
TG Inter Academic Calendar 2026-27
X

TG Inter Academic Calendar 2026-27: ఇంటర్ పరీక్షలు, దసరా, సంక్రాంతి సెలవుల తేదీలు ఇవే.. బోర్డు కీలక ప్రకటన!

TG Inter Academic Calendar 2026-27: తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి (TS BIE) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన వార్షిక ప్రణాళికను (Academic Calendar) ప్రకటించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు విద్యాసంస్థల సౌకర్యార్థం సెలవులు, పరీక్షల తేదీలను ముందస్తుగానే ఖరారు చేసింది.

జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభం:

వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి వేసవి సెలవుల అనంతరం జూన్ 1, 2026న ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 224 పని దినాలు ఉంటాయని బోర్డు స్పష్టం చేసింది.

ముఖ్యమైన తేదీల వివరాలు:

కాలేజీల పునఃప్రారంభం: జూన్ 1, 2026

అర్ధ వార్షిక (Half Yearly) పరీక్షలు: అక్టోబర్ 3 నుండి అక్టోబర్ 9, 2026 వరకు.

దసరా సెలవులు: అక్టోబర్ 10 నుండి అక్టోబర్ 21, 2026 వరకు (తిరిగి అక్టోబర్ 22న ప్రారంభం).

సంక్రాంతి సెలవులు: జనవరి 13 నుండి జనవరి 17, 2027 వరకు.

ప్రీ-ఫైనల్ పరీక్షలు: జనవరి 18 నుండి జనవరి 23, 2027 వరకు.

ప్రాక్టికల్ పరీక్షలు: జనవరి చివరి వారం, 2027.

వార్షిక పరీక్షలు (Final Exams): ఫిబ్రవరి చివరి వారం, 2027.

చివరి పని దినం: మార్చి 27, 2027.

వేసవి సెలవులు: మార్చి 28 నుండి మే 30, 2027 వరకు.

ప్రైవేట్ కాలేజీలకు కఠిన ఆదేశాలు:

ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎస్. కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాలలు తప్పనిసరిగా బోర్డు ప్రకటించిన క్యాలెండర్‌ను అనుసరించాలని ఆదేశించారు. ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాల్లో తరగతులు నిర్వహించరాదని, అడ్మిషన్ల ప్రక్రియ కూడా బోర్డు షెడ్యూల్ ప్రకారమే జరగాలని ఆయన స్పష్టం చేశారు.

ఏప్రిల్ 10 లోపు ఇంటర్ ఫలితాలు?

ప్రస్తుత విద్యా సంవత్సరం (2025-26) పరీక్షలు రాసిన విద్యార్థులకు బోర్డు శుభవార్త చెప్పింది. ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేసే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. ఏప్రిల్ 10వ తేదీ లోపే రిజల్ట్స్ ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story