TG SSC Results 2026 Live Updates: తెలంగాణ 10వ తరగతి ఫలితాలు నేడే.. రిజల్ట్స్ లింక్స్ ఇవే!

Telangana SSC 10th Class Results 2026 Live Updates: తెలంగాణ SSC ఫలితాలు 2026 ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు విడుదల కానున్నాయి. ఫలితాల డైరెక్ట్ లింక్స్, మార్క్స్ మెమో డౌన్‌లోడ్ విధానం మరియు లేటెస్ట్ అప్‌డేట్స్ ఇక్కడ పొందండి.

veeru
Updated on: 29 April 2026 12:09 PM IST
Telangana SSC 10th Class Results 2026 Live Updates
X

TG SSC Results 2026 LIVE

Telangana SSC Results 2026 Live Updates: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పదవ తరగతి (SSC) ఫలితాల సమయం ఆసన్నమైంది. తెలంగాణ మాధ్యమిక విద్యా మండలి (BSE) ఈరోజు, ఏప్రిల్ 29న మధ్యాహ్నం 2:00 గంటలకు ఫలితాలను విడుదల చేయనుంది.

ముఖ్య సమాచారం:

ఫలితాల సమయం: మధ్యాహ్నం 2:00 గంటలకు.

వేదిక: గోదావరి ఆడిటోరియం, SCERT ప్రాంగణం, బషీర్‌బాగ్, హైదరాబాద్.

విడుదల చేసేవారు: తెలంగాణ ప్రభుత్వ సలహాదారు శ్రీ K. కేశవ రావు గారు.

ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్లు:

విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్‌ను ఉపయోగించి కింది వెబ్‌సైట్లలో మార్కుల మెమోను చెక్ చేసుకోవచ్చు:

bse.telangana.gov.in

results.bse.telangana.gov.in

results.bsetelangana.org

school.edu.telangana.gov.in

మార్క్స్ మెమో డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?

పైన పేర్కొన్న ఏదైనా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

హోమ్ పేజీలో కనిపించే 'TG SSC Result 2026' లింక్‌పై క్లిక్ చేయండి.

♦ మీ హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేయండి.

♦ సబ్మిట్ బటన్ నొక్కగానే మీ మార్కుల మెమో స్క్రీన్‌పై కనిపిస్తుంది.

♦ భవిష్యత్తు అవసరాల కోసం దానిని ప్రింట్ లేదా పిడిఎఫ్ రూపంలో సేవ్ చేసుకోండి.

ప్రత్యామ్నాయ మార్గాలు (SMS & వాట్సాప్):

భారీ ట్రాఫిక్ వల్ల వెబ్‌సైట్లు ఓపెన్ కాకపోతే, విద్యార్థులు డిజిలాకర్, SMS మరియు వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు పొందవచ్చు.

వాట్సాప్ విధానం: 8096958096 నంబర్‌కు "Hi" అని మెసేజ్ పంపి, సూచనల ప్రకారం హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే చాలు.

మెమోలో తనిఖీ చేయాల్సిన వివరాలు:

విద్యార్థులు తమ రిజల్ట్ షీట్‌లో పేరు, హాల్ టికెట్ నంబర్, సబ్జెక్టుల వారీగా వచ్చిన గ్రేడ్లు/మార్కులు మరియు పాస్/ఫెయిల్ స్టేటస్‌ను సరిచూసుకోవాలి.

Live Updates

  • 29 April 2026 10:56 AM IST

    TG SSC 10th Results 2026 Live Updates: మీసేవ వాట్సాప్ ద్వారా రిజల్ట్స్.. ఇలా చెక్ చేసుకోండి!


    ♦ ముందుగా మీ మొబైల్‌లో 8096958096 నంబర్‌ను 'MeeSeva Telangana' పేరుతో సేవ్ చేసుకోండి.

    ♦ వాట్సాప్ ఓపెన్ చేసి, ఆ నంబర్‌కు "Hi" అని మెసేజ్ పంపండి.

    ♦ అక్కడ వచ్చే మెనూలో "SSC Results" ఆప్షన్‌ను ఎంచుకోండి.

    ♦ అనంతరం మీ హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీని ఎంటర్ చేయండి.

    వెంటనే మీ రిజల్ట్స్ మరియు మార్క్స్ మెమో డిజిటల్ కాపీ మీ వాట్సాప్‌కు వస్తుంది.

  • 29 April 2026 10:47 AM IST

    TG SSC 10th Results 2026 Live Updates: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలైన తర్వాత…. సప్లిమెంటరీ పరీక్ష తేదీలను ప్రకటిస్తారు. అందుకు అనుగుణంగా షెడ్యూల్ ను విడుదల చేస్తారు.

  • 29 April 2026 10:45 AM IST

    TG SSC 10th Results 2026 Live Updates: 5 లక్షలకుపైగా విద్యార్థులు

    రాష్ట్రవ్యాప్తంగా మార్చి 14వ తేదీ నుంచి ప్రారంభమైన పదో తరగతి ప్రధాన పరీక్షలు ఏప్రిల్ 13వ తేదీతో ముగిశాయి. సుమారు 5.15 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.

  • 29 April 2026 10:43 AM IST

    TG SSC Result 2026 Live Updates: డీజీలాకర్ ద్వారా కూడా SSC మార్కుల మెమో అందుబాటులో ఉంటుంది. ఇది డిజిటల్‌గా వెరిఫై చేయబడిన అధికారిక డాక్యుమెంట్‌గా పరిగణించబడుతుంది. Read more

  • 29 April 2026 10:34 AM IST

    TG SSC Result 2026 Live Updates: మరికొన్ని గంటల్లోనే ఫలితాలు

    తెలంగాణ పదో తరగతి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల నిరీక్షణకు మరికొద్ది గంటల్లోనే తెరపడనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు రిజీల్ అవుతాయి.

veeru

veeru

Next Story