TG SSC 10th Class Results links 2026: తెలంగాణ 10వ తరగతి ఫలితాలు 2026..వెబ్సైట్ లింకులు.. వాట్సాప్ ద్వారా చెక్ చేసే విధానం
TG SSC 10th Class Results links 2026: తెలంగాణ పదవ తరగతి ఫలితాలు నేడు మధ్యాహ్నం 2 గంటలకు విడుదల కానున్నాయి. ఫలితాల కోసం అధికారిక వెబ్సైట్ లింకులు, వాట్సాప్ ద్వారా చెక్ చేసుకునే విధానం ఇక్కడ చూడండి.
TG SSC 10th Class Results links 2026: తెలంగాణ 10వ తరగతి ఫలితాలు 2026..వెబ్సైట్ లింకులు.. వాట్సాప్ ద్వారా చెక్ చేసే విధానం
TG SSC 10th Class Results links 2026: తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి (SSC) పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థుల నిరీక్షణకు తెరపడనుంది. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSE) నేడు, ఏప్రిల్ 29న మధ్యాహ్నం 2:00 గంటలకు పదవ తరగతి ఫలితాలను అధికారికంగా విడుదల చేయనుంది.
హైదరాబాద్‌లోని ఎస్సీఈఆర్టీ (SCERT) క్యాంపస్‌లో జరిగే కార్యక్రమంలో ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు ఈ ఫలితాలను విడుదల చేస్తారు. ఈ ఏడాది సుమారు 5.28 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
ఫలితాలు లభించే అధికారిక వెబ్సైట్లు:
ఫలితాల విడుదల అనంతరం విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్‌ను ఎంటర్ చేసి కింద పేర్కొన్న వెబ్సైట్లలో మార్కుల మెమోను డౌన్లోడ్ చేసుకోవచ్చు:
♦ results.bse.telangana.gov.in
వాట్సాప్ (WhatsApp) ద్వారా ఫలితాలు పొందే విధానం:
వెబ్సైట్లు రద్దీగా ఉన్నా లేదా ఇంటర్నెట్ నెమ్మదిగా ఉన్నా విద్యార్థులు సులభంగా ఫలితాలు తెలుసుకోవడానికి ప్రభుత్వం ‘మీసేవ’ వాట్సాప్ సర్వీస్‌ను అందుబాటులోకి తెచ్చింది.
♦ మీ మొబైల్లో 8096958096 నంబర్‌ను సేవ్ చేసుకోండి.
♦ వాట్సాప్‌లో ఆ నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపండి.
♦ అక్కడ వచ్చే మెనూలో “SSC Results 2026” ఆప్షన్‌ను ఎంచుకోండి.
♦ మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే మీ ఫలితాలు వెంటనే మొబైల్ స్క్రీన్‌పై కనిపిస్తాయి.
విద్యార్థులు తమ ఫలితాలను ధృవీకరించుకున్న తర్వాత డిజిటల్ మార్క్స్ మెమోను భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ తీసుకోవాలని అధికారులు సూచించారు.




