TG TET Results 2026: తెలంగాణ టెట్ ఫలితాలు వచ్చే శాయి.. రిజల్ట్స్ అప్‌డేట్ మీకోసం!
TG TET Results 2026: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET 2026) జూన్ సెషన్ ఫలితాలు విడుదలయ్యాయి.
TG TET Results 2026: తెలంగాణ టెట్ ఫలితాలు వచ్చే శాయి.. రిజల్ట్స్ అప్‌డేట్ మీకోసం!
TG TET Results 2026: తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET-2026) జూన్ సెషన్ ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ సోమవారం మధ్యాహ్నం ఈ ఫలితాలను విలేకరుల సమావేశంలో విడుదల చేశారు. ఈ ఏడాది టెట్ ఫలితాలలో మొత్తం 43.94 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఆయన అధికారికంగా వెల్లడించారు.
ఈ ఏడాది జూన్ 16వ తేదీ నుండి జూన్ 22వ తేదీ వరకు మొత్తం పది సెషన్లలో ఆన్‌లైన్ (CBT) పద్ధతిలో విద్యాశాఖ ఈ పరీక్షలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. జూన్ సెషన్‌కు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,53,752 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 1,15,028 మంది (74.81 శాతం) అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు.
ఈసారి పరీక్షకు హాజరైన మొత్తం అభ్యర్థులలో 23,623 మంది ఇన్‌సర్వీస్ (ప్రస్తుతం విధుల్లో ఉన్న) టీచర్లు ఉండటం గమనార్హం. అయితే, సాధారణ అభ్యర్థులతో పోలిస్తే ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయుల ఉత్తీర్ణత శాతం ఈసారి తక్కువగా నమోదైంది. పరీక్ష రాసిన ఇన్‌సర్వీస్ టీచర్లలో కేవలం 37.29 శాతం మంది మాత్రమే అర్హత సాధించినట్లు విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ స్పష్టం చేశారు. అర్హత సాధించిన అభ్యర్థులు తమ అధికారిక వెబ్‌సైట్ ద్వారా స్కోర్ కార్డ్‌లను డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.




