TSLPRB: తెలంగాణ పోలీసు ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగింపు

TSLPRB: తెలంగాణలో పోలీసు ఉద్యోగాల దరఖాస్తు గడువును సెప్టెంబర్ 16 వరకు పొడిగించినట్లు TSLPRB తెలిపింది.

Arun Chilukuri
Published on: 8 Sept 2026 2:28 PM IST
TSLPRB
X

TSLPRB: తెలంగాణ పోలీసు ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగింపు

TSLPRB: తెలంగాణలో పోలీసు ఉద్యోగాల దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 7,437 పోస్టుల భర్తీ నిమిత్తం జులై 29న బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఈ నోటిఫికేషన్ ద్వారా పోలీస్ కానిస్టేబుల్ సివిల్ (3,697), ఏఆర్ (1,052), పోలీస్ కానిస్టేబుల్ (ఎస్‌ఏఆర్ సీపీఎల్‌ మెన్) 24, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ (1,380), ఫైర్ ఫైటర్ (751), జైలు వార్డర్ (208) పోస్టులను భర్తీ చేయనున్నారు. వాస్తవానికి దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 9గా ఉండగా.. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఆ గడువును సెప్టెంబరు 16 వరకు పొడిగించారు.

ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 3,38,336 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోగా.. 2,88,530 మంది అభ్యర్థులు ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసినట్టు TSLPRB తెలిపింది. అలాగే అభ్యర్థుల ఆధార్ వెరిఫికేషన్ కూడా 95 శాతానికి పైగా పూర్తయిందని పేర్కొంది. చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు, ఇతర సాంకేతిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున, అభ్యర్థులు చివరి వరకు వేచి చూడకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు సూచించింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story