UPSC Mains Results 2026: యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ ఫలితాలు విడుదల: ఇంటర్వ్యూకు 2,526 మంది ఎంపిక

UPSC Mains Results 2026: UPSC సివిల్స్ మెయిన్స్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. 2,526 మంది ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. ఫలితాలు ఎలా చూడాలో తెలుసుకోండి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 5 Nov 2026 11:15 PM IST
UPSC Mains Results 2026
X

UPSC Mains Results 2026: యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ ఫలితాలు విడుదల: ఇంటర్వ్యూకు 2,526 మంది ఎంపిక

UPSC Mains Results 2026: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ మెయిన్స్ 2026 ఫలితాలను ప్రకటించింది. ఈ పరీక్షల్లో అర్హత సాధించిన 2,526 మంది అభ్యర్థులను తదుపరి దశ అయిన పర్సనాలిటీ టెస్ట్‌ (ఇంటర్వ్యూ)కు ఎంపిక చేసింది. మొత్తం 1,016 పోస్టుల భర్తీ కోసం నిర్వహిస్తున్న ఈ నియామక ప్రక్రియలో మెయిన్స్ ఫలితాలు వెలువడటంతో అభ్యర్థుల్లో ఉత్కంఠకు తెరపడింది.

1,016 పోస్టుల కోసం ఎంపిక ప్రక్రియ

సివిల్ సర్వీసెస్ నియామక ప్రక్రియలో భాగంగా తొలుత ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన 13,343 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు ఎంపికయ్యారు. అనంతరం నిర్వహించిన మెయిన్స్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన 2,526 మందికి ఇంటర్వ్యూకు హాజరయ్యే అవకాశం లభించింది.

ఆగస్టు 21 నుంచి మెయిన్స్ పరీక్షలు

UPSC సివిల్ సర్వీసెస్ మెయిన్స్ 2026 పరీక్షలను ఆగస్టు 21, 22, 23, 29, 30 తేదీల్లో నిర్వహించారు. తాజాగా ఫలితాలు ప్రకటించడంతో ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులు తదుపరి దశకు సిద్ధం కావాల్సి ఉంటుంది.

రోల్ నంబర్‌తో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు

ఇంటర్వ్యూకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను UPSC అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతుంది. అభ్యర్థులు తమ రోల్ నంబర్ ఆధారంగా ఫలితాలను పరిశీలించుకోవచ్చు. ఇంటర్వ్యూ తేదీలు, డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ (DAF), సమర్పించాల్సిన ధ్రువపత్రాలు, ఇతర మార్గదర్శకాలకు సంబంధించిన వివరాలను కమిషన్ ప్రత్యేకంగా ప్రకటించనుంది.

కాబట్టి అర్హత సాధించిన అభ్యర్థులు ఇంటర్వ్యూ ప్రక్రియకు సంబంధించిన తాజా సమాచారం కోసం UPSC అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా పరిశీలించాలని సూచించబడింది.

UPSC మెయిన్స్ ఫలితాలు 2026 – ముఖ్యమైన వివరాలు

- ఫలితాల విడుదల తేదీ: నవంబర్ 5, 2026

- ఇంటర్వ్యూకు ఎంపికైనవారు: 2,526 మంది

- మొత్తం ఖాళీలు: 1,016

- మెయిన్స్ పరీక్ష తేదీలు: ఆగస్టు 21, 22, 23, 29, 30

- DAF ఆన్‌లైన్ ప్రక్రియ: నవంబర్ 11 నుంచి 25 వరకు, సాయంత్రం 6 గంటల వరకు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్