Inter Results: నేడే ఏపీ ఇంటర్ ఫలితాలు. ఇలా చెక్ చేసుకోండి

Inter Results: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి.

Naresh.k
Published on: 15 April 2026 9:23 AM IST
Inter Results
X

Inter Results: నేడే ఏపీ ఇంటర్ ఫలితాలు. ఇలా చెక్ చేసుకోండి

AP Inter Results 2026: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులు గత కొన్ని రోజులుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ ఫస్టియర్,సెకండ్ ఇయర్ ఫలితాలు ఈరోజు(బుధవారం) విడుదల కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన చేశారు. మంత్రి లోకేష్ వెల్లడించిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 10:31 గంటలకు ఇంటర్ ఫలితాలను అధికారికంగా వెల్లడిస్తారు. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 23 వరకు జరిగిన ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?

విద్యార్థులు తమ రిజల్ట్స్ కోసం అధికారిక వెబ్‌సైట్.. https://resultsbie.ap.gov.in సందర్శించి మీ హాల్ టికెట్ నంబర్ ద్వారా ఫలితాలు పొందవచ్చు. ఈసారి విద్యార్థుల సౌకర్యార్థం వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు పొందే వెసులుబాటు కల్పించారు. 9552300009 నంబర్‌కు మెసేజ్ చేయడం ద్వారా మీ మార్కుల వివరాలను తెలుసుకోవచ్చు.

ఆలస్యానికి కారణం ఇదేనా?

తెలంగాణలో ఇప్పటికే ఫలితాలు విడుదలైనప్పటికీ, ఏపీలో కాస్త ఆలస్యమవ్వడానికి ప్రధాన కారణం ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశపెట్టిన కొన్ని సంస్కరణలేనని తెలుస్తోంది. ఈ మార్పుల వల్ల పరీక్షల నిర్వహణకు నెల రోజులకు పైగా సమయం పట్టింది. దీంతో మూల్యాంకన ప్రక్రియ పూర్తి కావడానికి అధికారులు అదనపు సమయం తీసుకున్నారు. పక్కాగా, ఎటువంటి పొరపాట్లు లేకుండా ఫలితాలు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. పరీక్షా ఫలితాలు వచ్చే సమయంలో సర్వర్లపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పైన పేర్కొన్న వెబ్‌సైట్‌తో పాటు వాట్సాప్ నంబర్‌ను కూడా సిద్ధంగా ఉంచుకోవడం ఉత్తమం. ఈరోజు ఉదయం 10:31 గంటల నుంచి ఫలితాలు అందుబాటులోకి వస్తాయి.

https://resultsbie.ap.gov.in


Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story