CBSE Results: సీబీఎస్ఈ పదో తరగతి రిజల్ట్స్ ఎప్పుడు.? ఎలా చెక్ చేసుకోవాలి
CBSE Results: సీబీఎస్ఈ 10వ తరగతి రెండో విడత (Session-2) బోర్డు పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
CBSE Results: సీబీఎస్ఈ పదో తరగతి రిజల్ట్స్ ఎప్పుడు.? ఎలా చెక్ చేసుకోవాలి
CBSE Results: సీబీఎస్ఈ 10వ తరగతి రెండో విడత (Session-2) బోర్డు పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ మార్కులను ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చు.
ఫలితాలు ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంది?
CBSE 10వ తరగతి రెండో విడత పరీక్షలు మే 15 నుంచి మే 21, 2026 వరకు నిర్వహించారు. ఈ ఏడాది నుంచి CBSE ప్రవేశపెట్టిన డ్యూయల్ పరీక్షల విధానం (Dual Exam Framework)లో భాగంగా ఈ పరీక్షలు జరిగాయి. ప్రస్తుతం మూల్యాంకన ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఫలితాలను జూన్ రెండో వారంలో ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?
విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవడానికి కింది స్టెప్స్ ఫాలో అవ్వాలి.
* "Class 10 Board Examination 2026 (Second Phase) Result" లింక్‌పై క్లిక్ చేయాలి.
* రోల్ నంబర్, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డ్ ఐడీ, పుట్టిన తేదీ వంటి వివరాలు నమోదు చేయాలి.
* అనంతరం 'Submit' బటన్‌పై క్లిక్ చేయాలి.
* స్క్రీన్‌పై ఫలితాలు కనిపిస్తాయి.
* మార్కులను పరిశీలించి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
* భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకోవాలి.
విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు
ఫలితాలు చూసే ముందు అడ్మిట్ కార్డ్‌ను సిద్ధంగా ఉంచుకోవాలి. అందులో ఉన్న రోల్ నంబర్, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డ్ ఐడీ వివరాలు అవసరం అవుతాయి. ఫలితాలు ప్రకటించిన తర్వాత మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసి భద్రపరచుకోవాలి. ఒరిజినల్ మార్కుల మెమోను తర్వాత సంబంధిత పాఠశాలల ద్వారా పొందవచ్చు.




