NEET Exam: నీట్ రీ ఎగ్జామ్‌.. విద్యార్థులు త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన కీల‌క విష‌యాలు

NEET Exam: దేశవ్యాప్తంగా 22 లక్షలకుపైగా విద్యార్థులను ప్రభావితం చేసిన ప్రశ్నాపత్రం లీక్, అవకతవకల ఆరోపణల నేపథ్యంలో NEET-UG 2026 పరీక్షను రద్దు చేశారు.

Mokshith
Published on: 16 May 2026 12:22 PM IST
NEET Exam
X

NEET Exam: నీట్ రీ ఎగ్జామ్‌.. విద్యార్థులు త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన కీల‌క విష‌యాలు

NEET Exam: దేశవ్యాప్తంగా 22 లక్షలకుపైగా విద్యార్థులను ప్రభావితం చేసిన ప్రశ్నాపత్రం లీక్, అవకతవకల ఆరోపణల నేపథ్యంలో NEET-UG 2026 పరీక్షను రద్దు చేశారు. ఇప్పుడు మళ్లీ రీ-ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. ఈ నేప‌థ్యంలో విద్యార్థులు గమనించాల్సిన పూర్తి వివరాలు ఇవే.

రీ-ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది?

NEET-UG 2026 రీ-ఎగ్జామ్ జూన్ 21, 2026 (ఆదివారం)న నిర్వహించనున్నారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు ఉంటుంది. పరీక్ష ప్రారంభానికి ముందు అవసరమైన ఫార్మాలిటీస్ కోసం అదనంగా 15 నిమిషాల సమయం ఇస్తారు. ఈసారి కూడా పరీక్ష పెన్ అండ్ పేపర్ (ఆఫ్‌లైన్) విధానంలోనే జరుగుతుంది.

ఎగ్జామ్ సిటీ మార్చుకునే అవకాశం

ప్రస్తుతం ఉన్న చిరునామా మారిన విద్యార్థులకు పరీక్ష నగరాన్ని మార్చుకునే అవకాశం కల్పించారు. ఇందుకోసం అభ్యర్థులు మే 15 నుంచి మే 21, 2026 వరకు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థులు మొదటి, రెండో ప్రాధాన్యత నగరాలను ఎంపిక చేసుకోవచ్చు. ఎవరైనా కొత్తగా ఎంపిక చేయకపోతే, గతంలో ఇచ్చిన ఎగ్జామ్ సిటీనే కొనసాగిస్తారు. అయితే చిరునామా, ఎగ్జామ్ సిటీ తప్ప ఇతర వివరాల్లో ఎలాంటి మార్పులు అనుమతించరు. మే 21 తర్వాత వచ్చిన అభ్యర్థనలను NTA పరిగణనలోకి తీసుకోదు.

పరీక్ష ఫీజు, భాషలపై కీలక సమాచారం

ముందుగా రద్దైన పరీక్ష కోసం చెల్లించిన ఫీజును విద్యార్థులకు తిరిగి చెల్లిస్తారు. రీ-ఎగ్జామ్ కోసం అదనపు ఫీజు వసూలు చేయబోమని NTA తెలిపింది. పరీక్ష మొత్తం 13 భాషల్లో నిర్వ‌హిస్తారు. వీటిలో అస్సామీ, బెంగాలీ, ఇంగ్లిష్, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాష‌ల్లో ఉంటుంది.

అడ్మిట్ కార్డులు, సిటీ స్లిప్ ఎప్పుడు?

ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్, అడ్మిట్ కార్డులతో పాటు ఇతర వివరాలను త్వరలో విడుదల చేయనున్నారు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్లు మాత్రమే పరిశీలించాలని NTA సూచించింది. ఇదిలా ఉంటే NEET-UG పరీక్షలో వచ్చే ఏడాది నుంచి కీలక మార్పు ఉండనుంది. ఇప్పటివరకు ఆఫ్‌లైన్ విధానంలో జరుగుతున్న పరీక్షను ఇకపై కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్‌ (CBT) మోడ్‌లో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. విద్యార్థులకు ఏవైనా సందేహాలు ఉంటే 011-40759000, 011-69227700 హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించవచ్చు:

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story