Kukunoor: కుక్కునూరులో సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ ఆధ్వర్యంలో సదస్సు!

Kukunoor: కుక్కునూరులో సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ ఆధ్వర్యంలో కుల సమస్యపై సదస్సు నిర్వహించారు. కుల

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 27 Sept 2026 7:47 PM IST
Kukunoor
X

Kukunoor: కుక్కునూరులో సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ ఆధ్వర్యంలో సదస్సు!

Kukunoor: కుల వివక్ష, సామాజిక అసమానతల నిర్మూలనకు వర్గ పోరాటం అవసరమని సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ ఏలూరు జిల్లా కమిటీ కార్యదర్శి ఎస్‌కే. గౌస్ అన్నారు. కుక్కునూరు సీఎంల కాలనీలో కుల సమస్యపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు.

మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే, తంతై ఈవీ రామస్వామి తదితరులు కుల వివక్షకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమాలను ఆయన వివరించారు. విద్య, సమాన హక్కులు, అంటరానితనం నిర్మూలన కోసం వారు చేసిన పోరాటాలను ప్రస్తావించారు. కుల వ్యవస్థకు సామాజిక, ఆర్థిక పునాదులు ఉన్నాయని, వాటిలో మార్పు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచనా విధానాల ఆధారంగా వర్గ పోరాటం ద్వారా కుల వ్యవస్థ నిర్మూలన సాధ్యమవుతుందని గౌస్ పేర్కొన్నారు. మండల కార్యదర్శి కంగాల కల్లయ్య అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో పిఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి ఎస్‌కే. మున్ని, పెంకె వీరబాబు, సరియం ముత్యాలు, మాచర్ల వెంకటేశ్వర్లు, లక్కమల్ల సత్యం, పి. దుర్గమ్మ తదితరులు పాల్గొన్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR