Eluru: స్నేహానికి నిదర్శనం: దివంగత జర్నలిస్ట్ కుటుంబానికి సాయం!
Eluru: పోలవరం మండలం కొండ్రుకోటకు చెందిన దివంగత జర్నలిస్ట్ పూణేం నాగరాజు కుటుంబానికి 1995 బ్యాచ్ పదో తరగతి మిత్రులు రూ.60 వేల ఆర్థిక సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.
Eluru: స్నేహానికి నిదర్శనం: దివంగత జర్నలిస్ట్ కుటుంబానికి సాయం!
ఏలూరు: ఏలూరు జిల్లా పోలవరం మండలం కొండ్రుకోట గ్రామంలో తమతో కలిసి బెంచీ పంచుకున్నాడు, కలిసి అల్లరి చేశాడు, కలిసి పరీక్షలు రాశాడు. అలాంటి ప్రాణ స్నేహితుడు ఉన్నట్టుండి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. ఆ బాధ నుంచి ఇంకా తేరుకోకముందే, ఆ స్నేహితుడి కుటుంబం పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయారు (1995 బ్యాచ్ )10వ తరగతి విద్యార్థులు.వెంటనే అందరూ ఒకటయ్యారు.
"మా స్నేహితుడు లేకపోయినా, వాడి కుటుంబానికి మేమున్నాం" అని నిర్ణయించుకున్నారు.ఇటీవల అనారోగ్యం కారణంగా వారి తోటి విద్యార్థి పోలవరం మండలం లోని కొండ్రుకోట గ్రామానికి చెందిన పూనెం నాగరాజు (జర్నలిస్ట్ ) అకాల మరణం చెందాడు. తమ కళ్ల ముందే తిరిగిన స్నేహితుడు లేడనే వార్తను ఆ క్లాస్ మేట్స్ జీర్ణించుకోలేకపోయారు.స్నేహితుడిని కోల్పోయిన ఆ కుటుంబం ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందుల్లో ఉందని.
దీంతో 10వ తరగతి విద్యార్థులంతా ఒక వాట్సాప్ గ్రూప్ లో మాట్లాడుకున్నారు. ఎవరికి తోచినంత వారు, కొందరు తమ పాకెట్ మనీ నుండి,చిన్న చిన్న మొత్తాలను పోగుచేశారు. సేకరించిన 60,000 రూ మొత్తాన్ని తీసుకుని, వారంతా కలిసి నేరుగా మరణించిన స్నేహితుడి ఇంటికి వెళ్లారు. కన్నీరుమున్నీరవుతున్న అతని భార్య, పిల్లలకు ఆ డబ్బును అందజేసి, ధైర్యం చెప్పారు. ఆ డబ్బు విలువ ఎంత అనేది ముఖ్యం కాదు, వారు చూపిన బాధ్యత, మానవత్వం అందరినీ కదిలించింది.
ఆ దృశ్యాన్ని చూసిన స్థానికులు, "ఇది కదా నిజమైన స్నేహం అంటే. రక్త సంబంధం కంటే గొప్పది స్నేహ బంధం అని నిరూపించారు" అంటూ కన్నీళ్లతోనే వారిని అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా స్నేహితుడు మాకు స్నేహితుడు కాదు, వాడు మా, అన్న తమ్ముడు, వాడు లేని లోటు మేము తీర్చలేము కానీ వాడి కుటుంబానికి కష్టం వస్తే ఆదుకోవడం మా బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో కుంజెం అశోక్ మాస్టర్, షేక్ ఇమామ్ మాస్టర్ , బుల్లియ్య, గంగా ఆర్ఎంపీ డాక్టర్ తదితరులు పాల్గొన్నారు.




