Eluru: ఏలూరు జిల్లాలో ఇప్పటివరకు 785 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు!

Eluru: ఏలూరు జిల్లాలో ఇప్పటివరకు 785 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని జేసీ డా.ఎం.జె. అభిషేక్ గౌడ తెలిపారు. ఉంగుటూరులో రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 14 Nov 2026 10:38 AM IST
Eluru
X

Eluru: ఏలూరు జిల్లాలో ఇప్పటివరకు 785 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు!

Eluru: ఏలూరు జిల్లాలోని 7 మండలాల్లోని 24 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇంతవరకు 785 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని జిల్లా జాయింట్ కలెక్టర్ డా.ఎం. జె.అభిషేక్ గౌడ తెలిపారు. ఉంగుటూరు రైతు సేవా కేంద్రం పరిధిలో శుక్రవారం సాయంత్రం ధాన్యం ఆరబెట్టిన రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం రైతు సేవా కేంద్రంలో రైతులతో జేసీ అభిషేక్ గౌడ మాట్లాడుతూ జిల్లాలో 224 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అవసరమైన సిబ్బంది,తేమశాతం కొలిచే యంత్ర పరికరాలు,ధాన్యం శుభ్రం చేసే యంత్రాలు,గోనెసంచుల,తదితర సదుపాయాలు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు.

ఇటీవల అర్నాబ్ మరియు మురసు తుఫానుల ప్రభావంతో భారీ వర్షాలతో వరి పంట కోతలు,ధాన్యం ఆరబెట్టే ప్రక్రియలో రైతులకు కొంత జాప్యం జరిగిందని,ధాన్యంలో తేమ శాతం నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాల్సి ఉన్నందున,రైతులు ధాన్యాన్ని పూర్తిస్థాయిలో ఆరబెట్టిన అనంతరం విక్రయించేందుకు ముందుకు వస్తున్నారన్నారు.

జిల్లాలో ఉంగుటూరు మండలంలో 100 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని , భీమేడోలు, దెందులూరు,పెదపాడు,ముదినేపల్లి,జంగారెడ్డిగూడెం మండలాల్లో రైతుల నుండి 97 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు.రైతులు తాము పండించిన ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అందించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీఓ లక్ష్మీప్రసన్న,డిఎస్ఓ బాబు విలియమ్స్,పౌరసరఫరాల శాఖ డిఎం శివరామమూర్తి,తహసీల్దార్ సన్యాసిరావు,ప్రభృతులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్