Konaseema: విఘ్నేశ్వర స్వామి ఆలయంలో మందుబాబుల హల్ చల్
Konaseema: కోనసీమ జిల్లా అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో మందుబాబులు హల్ చల్ చేశారు.
Konaseema: విఘ్నేశ్వర స్వామి ఆలయంలో మందుబాబుల హల్ చల్
Konaseema: రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో మందు బాబులు హల్ చల్ చేశారు. ఏకంగా ఆలయంలోకి వచ్చి ప్రధాన ద్వారాలను మూసివేస్తూ భక్తులను ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. నిన్న సాయంత్రం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
స్థానికులు తెలపిన వివరాల ప్రకారం ఆలయంలో భక్తులు చెల్లించిన కొబ్బరి చెక్కలను తీసుకెళ్ళేందుకు ఆలయ పాటదారు చెందిన వ్యక్తి అప్పీ ఆటోను ఆలయం వెలుపల గల రహదారి మీద పార్క్ చేసి కొబ్బరి చెక్కలను ఆలయం నుండి తెచ్చుకొని ఆటోలోకి ఎగుమతి చేసుకొంటున్నారు. ఇంతలో ఇద్దరు మందు బాబులు అక్కడికి వచ్చి రహదారికి అడ్డంగా ఆటో ఎవరు పెట్టమన్నారని, ట్రాఫిక్ కు ఇబ్బందిగా ఉందని కేకలు వేస్తూ.. అతనిని దర్భాషలాడుతూ ఆటో గల వ్యక్తిపై దౌర్జన్యానికి దిగుతూ భౌతిక దాడి చేశారు.
అంతటితో ఆగకుండా ఆలయంలోకి వెళ్ళి ఉద్యోగులను నానా దుర్భాషలాడుతూ.. సెక్యూరిటీ గార్డును బయటకు నెట్టి ప్రధాన ద్వారాలను మూసివేసి భయభ్రాంతులకు గురిచేశారు. దీనితో ఒక్కసారిగా ఏమి జరుగుతుందో తెలియక ఆలయం లోపల ఉన్న భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. దీనిపై ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
ఉమ్మడి రాష్ట్రంలో ప్రాముఖ్యత కలిగిన విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ఇలాంటి దారుణ సంఘటన జరిగినా కొంతమంది నాయకులు దీనిని రాజీ చేస్తుండటం కొసమెరుపు. మందు బాబులు వల్ల ఆలయం భక్తులకు జరగరానిది ఏమైనా జరిగి ఉంటే ఇలానే చేస్తారా.. ఇదేనా హైందవ దర్మంలో భక్తులకు మీరిచ్చే భరోసా అంటూ ఆలయ అధికారుల తీరుపై హిందూ సమాజం మండిపడుతుంది.




