Eluru: ఘనంగా కామ్రేడ్ అల్లూరు సత్యనారాయణ శతజయంతి వేడుకల ప్రారంభం!

Eluru: సుందరయ్య భవనంలో కామ్రేడ్ అల్లూరు సత్యనారాయణ శతజయంతి ఉత్సవాలను సీఐటీయూ జిల్లా కార్యదర్శి యర్నం సాయికిరణ్ ఘనంగా ప్రారంభించారు.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 1 Aug 2026 11:09 PM IST
Eluru
X

Eluru: ఘనంగా కామ్రేడ్ అల్లూరు సత్యనారాయణ శతజయంతి వేడుకల ప్రారంభం!

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా స్వాతంత్ర్య పోరాట కాలం నుంచి ఏడున్నర దశాబ్దాల పాటు వ్యవసాయ, వ్యవసాయ కార్మిక, కార్మిక, ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించి తన యావత్ జీవితాన్ని కమ్యూనిస్టు ఉద్యమానికి అంకితం చేసిన కామ్రేడ్ అల్లూరు సత్యనారాయణ శతజయంతి ప్రారంభోత్సవం సందర్భంగా శనివారం స్థానిక సుందరయ్య భవనం ప్రజాసంఘాల కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి యర్నం సాయికిరణ్ మాట్లాడుతూ, భూస్వామ్య కుటుంబంలో జన్మించినప్పటికీ భూస్వామ్య, పెట్టుబడిదారీ దోపిడీకి వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన మహోన్నత కమ్యూనిస్టు నాయకుడు అల్లూరు సత్యనారాయణ అని కొనియాడారు. సమాజ మార్పు కోసం తన ధనం, శ్రమ, ఆలోచనలు, జీవితాన్ని పూర్తిగా ప్రజా ఉద్యమాలకు అంకితం చేశారని అన్నారు.

నేటి తరానికి ఆయన జీవితం, త్యాగం, పోరాట స్ఫూర్తి ఆదర్శమని, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు యర్రంశెట్టి నాగేందర్రావు, సిఐటియు కో.కన్వీనర్ షేక్ వలీపాషా,సిఐటియు నాయకులు మహబూబ్ బాషా, పోచవరపు వెంకటేశ్వర్లు, దార కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR

Next Story