Amalapuram: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలపై కలెక్టర్ సమీక్ష

Amalapuram: డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్ మహేష్ శనివారం సమీక్ష నిర్వహించారు.

PRABHU, RAZOLE
Published on: 16 May 2026 2:30 PM IST
Amalapuram
X

Amalapuram: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలపై కలెక్టర్ సమీక్ష

Amalapuram: డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణలో అధికారులు తమ తమ శాఖల బాధ్యతలు నిర్లక్ష్యo లేకుండా నిర్వహిస్తూ విద్యార్థుల భద్రత, సౌకర్యం మరియు పరీక్షల సమగ్రతను మొదటి ప్రాధాన్యంగా ఉంచి సమయానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు.శనివారం స్థానిక కలెక్టరేట్ నందు ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి ఆదేశాలు జారీచేశారు.

జరగబోయే ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలు పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కమిటీ సభ్యులను ఆదేశించారు. అడ్వాన్స్డ్ పరీక్షలు మే 21 నుండి జూన్ 4 వరకు నిర్వహించబడతాయన్నారు. ప్రతిరోజూ ఉదయం మరియు మధ్యాహ్నం రెండు సెషన్లుగా నిర్వహిస్తారన్నారు. జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించిన మొత్తం 14,171 మంది విద్యార్థులు హాజరుకానున్నారన్నారు.

కమిటీ సభ్యులు ముందుగా కేటాయించిన 30 పరీక్షా కేంద్రాలలో ఏర్పాటు సక్రమంగా ఉన్నది లేనిది సమగ్రంగా పరిశీలించాలన్నారు. ప్రశ్నపత్రాల భద్రతపై సమీక్షిస్తూ ప్రశ్న పత్రాలను జిల్లా స్థాయిలో 14 పోలీస్ స్టేషన్ల వద్ద అత్యంత పకడ్బందీగా భద్రపరచాలన్నారు ప్రశ్నపత్రాల మరియు జవాబు పత్రాల తరలింపు, రక్షణకు ప్రత్యేక భద్రత బృందాలను నియమించాలన్నారు. పోస్టల్ సూపరింటెండెంట్ వారు సీల్ చేసిన జవాబు పాత్రలను వాల్యూయేషన్ కేంద్రాలకు స్పీడ్ పోస్ట్ ద్వా రా భద్రతా చర్యలు నడుమ తరలించాలన్నారు.

ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 7 నుంచి జూన్ 11 వరకు అమలాపురం, కొత్తపేట కేంద్రాల్లో నిర్వహించబడతాయన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం జిల్లా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారన్నారు. ఏవిధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలను పటిష్టంగావించాలన్నారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేయాలని రెవెన్యూ శాఖను సూచించారు. పరీక్షల సమయంలో కేంద్రాలకు సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ కేఫ్ హౌస్‌లను తప్పనిసరిగా

మూసివేయించాలన్నారు. నిఘా కొరకు ఏర్పాటుచేసిన సీసీటీవీ,విద్యార్థుల సౌకర్యార్థం ఏపీ ఇపిడిసిఎల్ ఇంజనీర్లు పరీక్షా కేంద్రాల్లో నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేయాలన్నారు. మునిసిపల్, పంచాయతీ అధికారులు వేసవిలో విద్యార్థులకు తగినంత త్రాగునీటి వసతులు పారిశుద్ధ్య నిర్వహణ వసతులు కల్పించాలని, ప్రతి కేంద్రంలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ప్రాథమిక చికిత్స కిట్లు మరియు సిబ్బందితో కూడిన వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని డిఎం అండ్ హెచ్ఓని ఆదేశించారు.

ఆర్టీసీని పరీక్షా కేంద్రాల రూట్లలో ప్రత్యేక బస్సు సదుపాయాలను అమలు చేయమని సూచించారు, తద్వారా విద్యార్థుల రాకపోకలు సులభం అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నిధియా దేవి, డిఆర్ఓ వి.సుబ్బారావు, జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అధికారి చంద్రశేఖర్ బాబు, జిల్లా వైద్యశాఖాధికారి ఎం. దుర్గారావు దొర, కలెక్టరేట్ ఎవో కడలి కాశీ విశ్వేశ్వర రావు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story