Eluru: గెలిచిన వెంటనే పార్టీలకతీతంగా ప్రతి సమస్యను పరిష్కరిస్తానని హామీ!

Eluru:ఆగిరిపల్లి మండలం వట్టిగుడిపాడులో వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థి అనంతనేని రాంబాబు, 12 వార్డు సభ్యులు ఇంటింటికీ తిరుగుతూ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

Akkineni Venkata Satya Prasad, Nuzvid
Published on: 28 Nov 2026 4:49 PM IST
Eluru
X

Eluru: గెలిచిన వెంటనే పార్టీలకతీతంగా ప్రతి సమస్యను పరిష్కరిస్తానని హామీ!

Eluru: నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ఆగిరిపల్లి మండలం వట్టిగుడిపాడు గ్రామంలో పంచాయతీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది.గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వైయస్సార్సీపీ తరఫున అనంతనేని రాంబాబు,మరియు 12 వార్డులకు సంబంధించిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన నాటి నుండి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు.ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక వైయస్సార్సీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు మరియు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు.ప్రతిరోజూ రేయింబవళ్లు శ్రమిస్తూ,గ్రామంలోని ప్రతి గడపకూ వెళ్లి ప్రతి ఒక్క ఓటరును కలుస్తూ తమ అమూల్యమైన ఓటును సర్పంచ్ అభ్యర్థి అనంతనేని రాంబాబుకు మరియు 12 వార్డులలో పోటీ చేస్తున్న వైయస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థులకు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.

గత వైయస్సార్సీపీ పాలనలో గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజలకు మరోసారి గుర్తు చేస్తు,కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గ్రామంలో ఎక్కడైనా కొత్తగా పింఛన్లు ఇచ్చారా?కనీసం ఒక్క ఇల్లయినా నిర్మించారా? అంటూ ప్రజలను ఆలోచింపజేసేలా ప్రశ్నిస్తూ,ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు.ప్రచారంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి గ్రామస్తుల వ్యక్తిగత మరియు గ్రామ సమస్యలను ఓపికగా అడిగి తెలుసుకుంటున్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి అనంతనేని రాంబాబు మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించి నన్ను,నా వార్డు సభ్యులను గెలిపించిన వెంటనే,గ్రామంలో నెలకొన్న ప్రతి ఒక్క సమస్యను పార్టీలకతీతంగా పరిష్కరించి,వట్టిగుడిపాడును ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాను అని గ్రామస్తులకు భరోసా ఇస్తున్నారు.ఈ ప్రచారంలో గ్రామ స్థాయి నాయకులు,మహిళా విభాగం సభ్యులు,యువత పెద్ద ఎత్తున పాల్గొని అభ్యర్థులకు మద్దతుగా నిలుస్తున్నారు.

Akkineni Venkata Satya Prasad, Nuzvid

Akkineni Venkata Satya Prasad, Nuzvid