P Gannavaram: ఐదేళ్ల విధ్వంసం మీది.. రెండేళ్ల అభివృద్ధి మాది.. దాసరి

P Gannavaram: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం టీడీపీ కార్యాలయంలో కో-కన్వీనర్ దాసరి వీర వెంకట సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు.

RAJU, P GANNAVARAM
Published on: 12 Jun 2026 3:13 PM IST
P Gannavaram
X

P Gannavaram: ఐదేళ్ల విధ్వంసం మీది.. రెండేళ్ల అభివృద్ధి మాది.. దాసరి

P Gannavaram: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి,పవన్ కళ్యాణ్, ఐటి, విద్యాశాఖ మంత్రి లోకేష్ ల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారని, అభివృద్ధి కనిపించని వైసిపి నాయకులు కుంటి సాకులు చెబుతూ ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తూ రోడ్లు ఎక్కటం వారి విధ్వంస పాలనకు పరాకాష్ట అన్నారు.

ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా ఓటమి ప్రభుత్వం విజయోత్సవ సభలు నిర్వహిస్తుంటుంటే వైసీపీ మాత్రం వెన్నుపోటు దినం అంటూ ర్యాలీలు నిర్వహించడం వారికి రాష్ట్ర అభివృద్ధిపై ఏ మాత్రం అవగాహన ఉందో తేట తెల్లమవుతుందన్నారు.

రాష్ట్రం ఆర్దికంగా లోటు ఉన్నప్పటికీ ఎన్నికల హామీలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్న వైసీపీకి కనిపించకపోవడం విడ్డూరం అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే మెగా డీఎస్సీను నిర్వహించి 16,399 ఉద్యోగాలను పారదర్శకంగా వేస్తే, వైసిపి నిరుద్యోగులను అవమానించడం చాలా బాధాకరమన్నారు.

వైసిపి ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ కూడా వేయకుండా కూటమి ప్రభుత్వంలో వేసిన డీఎస్సీ పై అవాకులు చవాకులు పేలి, ఉద్యోగాలు పొందిన వారిని అవమానిస్తున్నారన్నారు. ప్రజాదారణ కోల్పోయిన మీరు ఎన్ని అబద్ధాలు ఆడినా రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఏమాత్రం విశ్వసించడం లేదన్నారు..

ప్రజల ఆలోచనలను పక్కదారి పట్టించేందుకు మీరు నిర్వహిస్తున్న ర్యాలీలు, నిరసనలు మీ పార్టీకే చెందుతుందన్నారు.

RAJU, P GANNAVARAM

RAJU, P GANNAVARAM

Next Story