Eluru: తుఫాన్ ముందస్తు చర్యలపై సీఎం చంద్రబాబు ఉన్నత సమీక్ష!

Eluru: రానున్న తుఫాన్ నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు సీఎం చంద్రబాబుకు ఏలూరు కలెక్టర్ కె. వెట్రిసెల్వి వివరించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 26 Oct 2026 12:09 AM IST
Eluru
X

Eluru: తుఫాన్ ముందస్తు చర్యలపై సీఎం చంద్రబాబు ఉన్నత సమీక్ష!

ఏలూరు: రానున్న తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో ఎటువంటి ప్రాణ,ఆస్తి నష్టాలు సంభవించకుండా పటిష్టమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు వివరించారు.

ఆదివారం సాయంత్రం తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం చంద్రబాబునాయుడు, సి ఎస్ సాయిప్రసాద్,ఉన్నతాధికారులు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్లందరూ ముందస్తు కార్యాచరణ ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలన్నారులోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని,తాగునీరు,వైద్యం,విద్యుత్ పునరుద్ధరణ వంటి అత్యవసర సేవలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు.

సమీక్షలో ఏలూరు కలెక్టరేట్ నుండి పాల్గొన్న కలెక్టర్ కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ0తుఫాన్ ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని స్పష్టం చేశారు.సమాచారం,సహాయక చర్యల కోసం జిల్లా స్థాయిలో ఇప్పటికే ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రికి నివేదించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్