Rampachodavaram: దివ్యాంగులకు కృత్రిమ పరికరాలు పంపిణీ

Rampachodavaram: పోలవరం జిల్లా రంపచోవరంలో ఘనంగా దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, కృత్రిమ పరికరాల పంపిణీ. హాజరైన కలెక్టర్ దినేష్ కుమార్, ఎమ్మెల్యే శిరీష దేవి.

Prasanna, Rampachodavaram
Published on: 21 July 2026 7:10 PM IST
Rampachodavaram
X

Rampachodavaram: దివ్యాంగులకు కృత్రిమ పరికరాలు పంపిణీ

రంపచోడవరం: మంగళవారం రంపచోడవరం స్థానిక ఐటీడీఏ ప్రాంగణంలో దివ్యాంగులకు కృత్రిమ పరికరాలు, ట్రై సైకిల్స్ పంపిణీ కార్యక్రమానికి పోలవరం జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్, రంపచోడవరం శాసనసభ్యులు, లెజిస్టేటివ్ చైర్మన్ శ్రీమతి మిరియాల శిరీష దేవి, పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్ కుమార్, రాష్ట్ర ఎస్టీ కమిషన్ నెంబర్ గొర్లె సునీత, ఎంపీపీ శ్రీమతి బంధం శ్రీదేవి, జడ్పిటిసి పండ వెంకటలక్ష్మి, పోలవరం జిల్లా రెవిన్యూ అధికారి పి. అంబేద్కర్ ముఖ్య అతిథులుగా హాజరైనారు.

ఈ సందర్భంగా పోలవరం జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ మాట్లాడుతూ పోలవరం జిల్లాలోని ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు ( సి డబ్ల్యూ యస్ ) ద్వారా నడవలేని వికలాంగులకు అదేవిధంగా కృత్రిమ పరికరాలు దివ్యాంగులకు 33 మందికి అందజేయడం జరిగిందని ఆయన తెలిపారు. రంపచోడవరం శాసనసభ్యులు శ్రీమతి మిరియాల శిరీష శ్రీదేవి మాట్లాడుతూ పోలవరం జిల్లాలో దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ఏప్పుడు అండగా ఉంటుందని ఆమె అన్నారు.

పోలవరం జిల్లాలో దివ్యాంగుల విద్యార్థులకు మేధస్సును పెంచే విధంగా తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆమె అన్నారు. దివ్యాంగులు ఎక్కడైనా ఉన్నాయెడల దివ్యాంగుల సర్టిఫికెట్లు మంజూరు చేసే విధంగా సంబంధిత అధికారులతో సంప్రదించడం జరుగుతుందని ఆమె అన్నారు. అనంతరం ముఖ్య అతిథులు చేతుల మీదుగా దివ్యాంగ విద్యార్థులకు ట్రై సైకిల్స్, కృత్రిమ అవయవాలు, తదితరవి అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రుక్మాండయ్య, డీఈవో జి. శ్రీరామ్ మూర్తి,ఎస్ఎస్సి అధికారి భాస్కర్ రావు,జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి కె.ఉమా, ఐ ఈ కోఆర్డినేటర్ భాస్కర్, శ్యాంసుందర్,,సహాయక గిరిజన సంక్షేమ శాఖ అధికారి జి.తమ్ముడు, ఎంఈఓ శ్రీనివాసరావు,డాక్టర్ నీలిమ,చిన్నిబాబు,జి. తాతారావు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

Prasanna, Rampachodavaram

Prasanna, Rampachodavaram

Next Story