Chintoor: ఆశీర్వాద దీపం సేవా సంకల్ప కార్యక్రమాలను విజయవంతం చేయాలి!
Chintoor: ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని కూనవరంలో ఆశీర్వాద దీపం, సేవా సంకల్ప కార్యక్రమాలు. ప్రతి ఇంటిలో దీపం వెలిగించాలని బీజేపీ మండల అధ్యక్షుడు పిలుపు.
Chintoor: ఆశీర్వాద దీపం సేవా సంకల్ప కార్యక్రమాలను విజయవంతం చేయాలి!
Chintoor: ఆశీర్వాద దీపం సేవా సంకల్ప కార్యక్రమాలను విజయవంతం చేయాలని కూనవరం బిజెపి మండల అధ్యక్షులు కరక పవన్ కుమార్ పిలుపునిచ్చారు.కూనవరం మండలం లోని బిజెపి నాయకులు కార్యకర్తలు సెప్టెంబర్ 17వ తేదిన మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోది పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి దీర్ఘాయుష్షు మరియు ఆరోగ్యకరమైన జీవితం కోసం ప్రార్థిస్తూ ప్రతి ఇంటిలో ఒక దీపాన్ని వెలిగిద్దాం అనే కార్యక్రమాన్ని ప్రతి ఒక్క కార్యకర్త పాటించాలని సూచించారు.
కూనవరం శివాలయం నందు మోది పేరు మీద అర్చన చేయించి అతనికి సంపూర్ణ ఆయుస్సు కలగాలని ప్రతి ఒక్కరం ఆ దేవునికి ప్రార్థన చేయాలని అన్నారు.అదే సందర్భంలో మన ఊరు మన జెండా కార్యక్రమంలో భాగంగా భీమవరం గ్రామంలో భారతీయ జనతా పార్టీ పతాక ఆవిష్కరణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు.
తదుపరి కార్యక్రమాలు సేవ సంకల్ప కార్యక్రమాలు నెల రోజులు పాటు జిల్లా రాష్ట్ర పార్టీల ఆదేశాల మేరకు మండల స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అన్నారు. కావున ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమాలకు హాజరై భారతీయ జనతా పార్టీ వ్యవస్థను ముందుకు నడిపిస్తూ సేవా సంకల్ప కార్యక్రమం ను విజయవంతం చేస్తూ ప్రజల్లో మోడీ గారి పరిపాలన సేవా సంకల్పాలు గురించి తెలియజేయాల్సిందిగా కోరారు.
కావున ప్రతి గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామాలలో భారతీయ జనతా పార్టీ పతాక ఆవిష్కరణ చేయాలని పిలుపునిచ్చారు. ముందుగా సేవా సంకల్ప కార్యక్రమాలతో ముందుకు సాగాలని ప్రతి ఒక్కరినీ కోరారు.సెప్టెంబర్ 17వ తారీఖున మండల పదాధికారులు, జిల్లా పదాధికారులు,రాష్ట్ర పదాధికారులు, సీనియర్ నాయకులు, మోర్చా అధ్యక్షులు అందరూ కూడా ఈ కార్యక్రమాలకు హాజరు కావలసిందిగా సూచించారు.




