Amalapuram: జనగణన ఒక దేశ సేవ.. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు
Amalapuram: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మే 1 నుండి జనగణన 2027 ప్రారంభం.
Amalapuram: జనగణన ఒక దేశ సేవ.. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు
Amalapuram: భారతదేశ భవిష్యత్తు మరియు అభివృద్ధి ప్రణాళికలకు పునాదిగా నిలిచే జనగణన - 2027 విధులను అధికారులు, సిబ్బంది అత్యంత నిబద్ధతతో, పారదర్శకతతో మే 1 నుండి నెల రోజుల పాటు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ ఆదేశించారు. బుధవారం ఈ మేరకు ఆయన ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. జనగణన ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం స్వీయగణన ప్రక్రియ కొనసాగుతుందని,
మే నెలలో నిర్వహించే డేటా సేకరణలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా, క్షేత్రస్థాయిలో వాస్తవ గణాంకాలను సేక రించడం పై సిబ్బంది దృష్టి సారించాలని ఆయన సూచిం చారు.అభివృద్ధికి పునాదిగా నిలుస్తున్న జనగణన ద్వారా సేకరించే సమాచారం ప్రభుత్వ విధానాల రూపకల్పనకు, సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలుకు మరియు వనరుల పంపిణీకి కీలకమని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
జనగణన 2027లో భాగంగా తొలి దశ హౌస్ లిస్టింగ్ మరియు హౌసింగ్ సెన్సెస్ పై ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు పూర్తి అవగాహనతో నిర్వహించాలని స్పష్టం చేశారు.ఈసారి జనగణన ప్రక్రియ పూర్తిస్థాయిలో డిజిటల్ విధానంలో నిర్వహించ బడుతుందని ఆయన తెలిపారు. మొబైల్ యాప్‌లు, ఆన్లైన్ మాడ్యూళ్ల వినియోగంపై సిబ్బంది పట్టు సాధించాలన్నారు. డేటా ఎంట్రీ సమయంలో సాంకేతిక లోపాలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలన్నారు.
శిక్షణా కార్యక్రమాల్లో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడమే లక్ష్యంగా పనిచేయాలని, బాధ్యతారా హిత్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.ప్రతి అధికారి, సిబ్బంది తమ బాధ్యతను దేశ సేవగా భావించి, ఖచ్చితమైన సమా చారాన్ని సేకరించాలన్నారు. క్షేత్రస్థాయిలో సేకరించే ప్రతి వివరమూ అత్యంత విలు వైనదన్నారు.




