Chintalapudi: చింతలపూడి సర్కిల్‌లో ఓటు హక్కును వినియోగించుకోవాలి
Chintalapudi: చింతలపూడి, లింగపాలెం ప్రాంతాల్లో స్థానిక ఎన్నికల వేళ సీఐ క్రాంతికుమార్ హెచ్చరిక. పోలింగ్ కేంద్రాలకు ఫోన్లు నిషేధం, ఐడీ కార్డులు తప్పనిసరి.
Chintalapudi: చింతలపూడి సర్కిల్‌లో ఓటు హక్కును వినియోగించుకోవాలి
చింతలపూడి: ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన ఓటు హక్కును చింతలపూడి సర్కిల్లోని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలని సీఐ క్రాంతికుమార్ పిలుపునిచ్చారు.ఎన్నికలు ప్రశాంతంగా,పారదర్శకంగా జరిగేందుకు ప్రజలు,రాజకీయ పార్టీలు పోలీసులకు సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా సిఐ క్రాంతి కుమార్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వద్దకు మొబైల్ ఫోన్లు, వాటర్ బాటిళ్లు తీసుకురాకూడదు అని ఓటు వేసేవారు ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడీ తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి అని పోలింగ్ కేంద్రాల వద్ద గుంపులుగా ఉండటం,
నిబంధనలకు విరుద్ధంగా టెంట్లు వేయడం ముఖ్యంగా చింతలపూడి,లింగపాలెం ప్రాంతాల్లో పూర్తిగా నిషేధం అని ఎన్నికల సమయంలో గొడవలకు దిగినా,శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా వారిపై బైండోవర్ కేసులు నమోదు చేసి,కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా,ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అందరూ బాధ్యతగా సహకరించాలని సీఐ కోరారు.




