Chintalapudi: ఎమ్మెల్యే రోషన్ చొరవతో16 సంవత్సరాల ప్రజల కల సాకారం
Chintalapudi: ఏలూరు జిల్లా కామవరపుకోట మండల ప్రజల 16 సంవత్సరాల నిరీక్షణకు తెరపడింది.
Chintalapudi: ఎమ్మెల్యే రోషన్ చొరవతో16 సంవత్సరాల ప్రజల కల సాకారం
Chintalapudi: కామవరపుకోట మండల ప్రజలు దాదాపు 16 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కల నేడు సాకారమైంది. చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ గారి ప్రత్యేక చొరవ, నిరంతర కృషితో సంవత్సరాల క్రితం నిలిచిపోయిన బస్సు సర్వీస్‌ను తిరిగి పునరుద్ధరిస్తూ నూతన బస్సు సర్వీస్‌ను ఘనంగా ప్రారంభించారు.
కామవరపుకోట మండల పరిధిలోని పాతూరు, అంకాలంపాడు, జలపవారిగూడెం, కె.ఎస్. రామవరం, కళ్ళచెరువు, తడికలపూడి గ్రామాల మీదుగా ఏలూరుకు వెళ్లే ఈ బస్సు సర్వీస్ ప్రారంభం కావడంతో స్థానిక ప్రజలు, మహిళలు, నాయకులు, కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే శ్రీ సొంగా రోషన్ కుమార్ గారు జెండా ఊపి బస్సు సర్వీస్‌ను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో తడికలపూడి ఎస్సై శ్రీమతి వల్లి పద్మ గారితో రిబ్బన్ కట్ చేయించి బస్సు సర్వీస్‌ను ప్రారంభించడం విశేషం.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ సొంగా రోషన్ కుమార్ గారు మాట్లాడుతూ, "ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఈ బస్సు సర్వీస్ పునరుద్ధరణ నా హామీల్లో ఒకటి. పాతూరు, అంకాలంపాడు, జలపవారిగూడెం, కె.ఎస్. రామవరం, కళ్ళచెరువు, తడికలపూడి గ్రామాల ప్రజలు రవాణా సౌకర్యం లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ప్రజల అవసరాలను గుర్తించి సంబంధిత అధికారులతో నిరంతరం చర్చించి ఈ బస్సు సర్వీస్‌ను తిరిగి తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రవాణా సౌకర్యాలు ఎంతో కీలకం. భవిష్యత్తులో కూడా ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకువస్తాం" అని అన్నారు.
ఈ సందర్భంగా గ్రామాల ప్రజలు, ముఖ్యంగా మహిళలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం మొత్తం ఉత్సాహభరిత వాతావరణంలో సాగగా, కార్యకర్తలు మరియు అభిమానులు "జై కూటమి", "జై పీఎం గారు", "జై సీఎం ", "జై డిప్యూటీ సీఎం ", "జై లోకేష్ ", "జై ఎమ్మెల్యే" అంటూ నినాదాలు చేస్తూ కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని తీసుకువచ్చారు.
ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని నూతన బస్సు సర్వీస్ ప్రారంభాన్ని విజయవంతం చేశారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించాలనే ఎమ్మెల్యే రోషన్ కుమార్ గారి సంకల్పానికి ఇది మరో నిదర్శనంగా నిలిచింది.




