Chintalapudi: చింతలపూడి బస్టాండ్ రూపురేఖలు మార్చిన కూటమి ప్రభుత్వం
Chintalapudi: చింతలపూడి పట్టణంలోని ఆర్టీసీ కొత్త బస్టాండ్‌లో 30 లక్షల వ్యయంతో చేపట్టిన ఆధునీకరణ పనులను స్థానిక ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఘనంగా ప్రారంభించారు.
Chintalapudi: చింతలపూడి బస్టాండ్ రూపురేఖలు మార్చిన కూటమి ప్రభుత్వం
Chintalapudi: 30 లక్షల వ్యయం తో చింతలపూడి ఆర్టీసీ కొత్త బస్టాండ్ ఆధునీకరణ పనుల ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ చింతలపూడి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ (కొత్త బస్టాండ్)లో పూర్తయిన ఆధునీకరణ పనుల ప్రారంభోత్సవాన్ని గౌరవ చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ గారు ఘనంగా నిర్వహించారు.
ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించేందుకు చేపట్టిన ఆధునీకరణ పనులు పూర్తికావడంతో వాటిని ప్రారంభించారు, ఈ సందర్భంగా బస్టాండ్‌లో కల్పించిన సౌకర్యాలను పరిశీలించి, ప్రయాణికులకు మరింత నాణ్యమైన సేవలు అందేలా అధికారులు కృషి చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ సొంగా రోషన్ కుమార్ గారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కట్టుబడి ఉందని, ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు చేపడుతోందని తెలిపారు. చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన ప్రతి పనిని దశలవారీగా పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి (DPTO), డిపో మేనేజర్, ఇతర ఆర్టీసీ అధికారులు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




