Chintalapudi: చింతలపూడిలో 16 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత!

Chintalapudi: ఏలూరు జిల్లా చింతలపూడిలో 16 మంది లబ్ధిదారులకు రూ. 7,05,921 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే రోషన్ కుమార్ అందజేశారు.

PINGULA ASHOK KUMAR, CHINTHALAPUDI
Published on: 25 Sept 2026 5:58 PM IST
Chintalapudi
X

Chintalapudi: చింతలపూడిలో 16 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత!

Chintalapudi: ఏలూరు జిల్లా చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ గారి చేతుల మీదుగా నియోజకవర్గానికి చెందిన 16 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు.

ఈ సందర్భంగా చింతలపూడి మండలానికి చెందిన 7 మంది లబ్ధిదారులకు రూ.3,06,829, జంగారెడ్డిగూడెం మండలానికి చెందిన 3 మంది లబ్ధిదారులకు రూ.1,04,785, లింగపాలెం మండలానికి చెందిన 5 మంది లబ్ధిదారులకు రూ.2,16,510, కామవరపుకోట మండలానికి చెందిన 1 లబ్ధిదారునికి రూ.77,797 చొప్పున ఆర్థిక సహాయం అందించారు.

మొత్తంగా 16 మంది లబ్ధిదారులకు రూ.7,05,921 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ గారు అందజేశారు. అవసర సమయంలో ప్రభుత్వం అందించే సహాయాన్ని అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా శాసనసభ్యులు తెలిపారు.

PINGULA ASHOK KUMAR, CHINTHALAPUDI

PINGULA ASHOK KUMAR, CHINTHALAPUDI