Chintalapudi: చింతలపూడిలో బోయగూడెం చెరువు కట్ట మరమ్మతు పనులు ప్రారంభం!
Chintalapudi: ఏలూరు జిల్లా చింతలపూడిలో బలహీనపడిన బోయగూడెం చెరువు కట్ట మరమ్మతు పనులను ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆదేశాల మేరకు యుద్ధప్రాతిపదికన ప్రారంభించారు.
Chintalapudi: చింతలపూడిలో బోయగూడెం చెరువు కట్ట మరమ్మతు పనులు ప్రారంభం!
Chintalapudi: చింతలపూడి నియోజకవర్గ ప్రజల సమస్యలపై శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ మరోసారి తనదైన శైలిలో తక్షణమే స్పందించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు చింతలపూడి పరిధిలోని బోయగూడెం చెరువు కట్ట మరమ్మతు పనులు అత్యంత వేగంగా ప్రారంభమయ్యాయి.
ఇటీవల చెరువు కట్ట బలహీనపడటంపై స్థానిక ప్రజలు, రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని గమనించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ గారు, తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు చింతలపూడి మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో యుద్ధప్రాతిపదికన ఈ మరమ్మతు పనులను చేపట్టారు.
చెరువు కట్ట పటిష్టత కోసం జరుగుతున్న ఈ పనులను మున్సిపల్, నీటిపారుదల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులు సిబ్బందికి సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ గారు మాట్లాడుతూ.. "వరదలు లేదా భారీ వర్షాల వల్ల భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చెరువు కట్టను పూర్తిగా పటిష్టపరచాలి. మరమ్మతు పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి, స్థానిక రైతులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి" అని అధికారులను కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే తక్షణ నిర్ణయంపై బోయగూడెం గ్రామ ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.




