Chintalapudi: ప్రగడవరం సొసైటీ సమావేశంలో ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్

Chintalapudi: ప్రగడవరం సొసైటీ జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్. రైతు సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టీకరణ.

PINGULA ASHOK KUMAR, CHINTHALAPUDI
Published on: 28 Sept 2026 9:51 PM IST
Chintalapudi
X

Chintalapudi: ప్రగడవరం సొసైటీ సమావేశంలో ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్

చింతలపూడి: రైతులు బాగుంటేనే అన్ని వర్గాల ప్రజలు బాగుంటారని, రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్ అన్నారు. చింతలపూడి మండలం ప్రగడవరం సొసైటీ వద్ద నిర్వహించిన జనరల్‌ బాడీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావించి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పెన్షన్లు, తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, విద్యార్థులకు అవసరమైన సహాయం, పౌష్టికాహారం వంటి పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు.

నియోజకవర్గ అభివృద్ధిలో ముందుకు వెళ్తోందని, జిల్లాలో రెండో స్థానంలో ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.గ్రామాల్లో తాగునీటి సౌకర్యం, సీసీ రోడ్లు, రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంనికి రహదారుల అభివృద్ధికి సుమారు రూ.22 కోట్లు మంజూరయ్యాయని, పనులను త్వరగా పూర్తి చేసి మరిన్ని నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు.

రేచర్ల, రాఘవపురం, టీ.నర్సాపురం, కామవరపుకోట తదితర ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి పనులు పూర్తి చేసేమని, తెలిపారు.డీఎస్సీ నియామక ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని అన్నారు. అభివృద్ధి పనులతోపాటు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. పంచాయతీ అభివృద్ధికి ప్రజలు, గ్రామ పెద్దలు కలిసి ఆలోచించాలని, స్థానిక సంస్థలను బలోపేతం చేసుకోవడం ద్వారా గ్రామానికి మరిన్ని అభివృద్ధి పనులు తీసుకురావచ్చని అన్నారు.

రైతులు, పశుపోషకుల సమస్యల పరిష్కారానికి కృషి

జగ్గవారపు ముత్తారెడ్డి, సొసైటీ చైర్మన్ తాళ్లూరి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రగడవరం గ్రామంలో రైతులు, పశుపోషకుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.గ్రామానికి 15 గోకుల్‌ షెడ్లు మంజూరు కాగా 12 షెడ్లను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఇప్పటికే ఐదు గోకుల్‌ షెడ్లు మంజూరయ్యాయని, మరో ఐదు మంజూరు చేయాలని కోరారు.గ్రామంలో పశువుల ఆస్పత్రి మంజూరు చేయాలని, అదనపు అటెండర్‌ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. రెండేళ్లుగా ఖాళీగా ఉన్న లైన్మెన్‌ పోస్టులను భర్తీ చేసి ప్రగడవరానికి లైన్మెన్‌ సౌకర్యం కల్పించాలని కోరారు .

సబ్‌స్టేషన్‌ టెండర్‌ ప్రక్రియను పూర్తి చేయించేందుకు ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్‌ చొరవ చూపారని తెలిపారు.రైతులకు డ్రిప్‌ సౌకర్యం కల్పించేందుకు సుమారు 80 ఎకరాలకు రూ.84 లక్షల సబ్సిడీ అందించినట్లు చైర్మన్‌ తెలిపారు.

సొసైటీ ద్వారా రైతులకు రూ.7.43 కోట్ల మేర ధాన్యం నగదు చెల్లింపులు చేసినట్లు చెప్పారు. గ్రామంలో మౌలిక వసతుల సొసైటీ ద్వారా రైతులు, సభ్యులకు రూ.6.50 కోట్ల మేర రుణాలు అందించినట్లు చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు. రైతులకు అవసరమైన సమయంలో రుణ సదుపాయం కల్పించడంతోపాటు గ్రామ అభివృద్ధికి ప్రభుత్వ సహకారంతో మరిన్ని నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా సొసైటీ ఆధ్వర్యంలో నూతన రుణాలకు సంబంధించిన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో సొసైటీ సభ్యులు,సుధీర్ రెడ్డి, రాజారెడ్డి, మానేపల్లి రాజారావు, తిరుపతిరావు, మహాలక్ష్మడు, కృష్ణ మూర్తి, మారేష్,రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

PINGULA ASHOK KUMAR, CHINTHALAPUDI

PINGULA ASHOK KUMAR, CHINTHALAPUDI