Chintalapudi: చింతలపూడి కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ముత్యాల శ్రీనివాస్
Chintalapudi: చింతలపూడి పట్టణ కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ముత్యాల శ్రీనివాస్ (చిన్ని) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు; ఐక్యతతో సమాజ సేవ చేయాలని నేతలు పిలుపునిచ్చారు.
Chintalapudi: చింతలపూడి కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ముత్యాల శ్రీనివాస్
చింతలపూడి: ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణ కాపు సంఘం సమావేశం పట్టణ గౌరవ అధ్యక్షులు తోట శివ నాగరాజు (నాని) గారి ఇంటి వద్ద చింతలపూడి నియోజకవర్గ కాపు నాయకులు బొడ్డు వెంకటేశ్వరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో చింతలపూడి పట్టణ కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా అందరి ఏక తీర్మానంతో చింతలపూడి పట్టణానికి చెందిన కాపు నాయకుడు ముత్యాల శ్రీనివాస్ (చిన్ని) గారిని ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కాపులందరూ కలిసిమెలిసి ఉంటూ ఐక్యమత్యంతో ముందుకు సాగాలని కాపులు అందరూ కూడా ప్రతి ఒక్కరికి సాయం చేసే మనస్తత్వం కలిగి ప్రతి పార్టీలోఉండి ఆ పార్టీలను ముందుకు తీసుకెళుతున్నారని తెలిపారు ఎవరు ఏ పార్టీలో ఉన్నా కులానికి వచ్చేసరికి ప్రతి ఒక్కరూ పార్టీలను పక్కనపెట్టి ఒకరికొకరు సాయం చేసుకోవాలని మన కులాన్ని ముందుకు తీసుకువెళ్తూ పక్క కులాలని గౌరవిస్తూ ఉండాలని అందరి సహకారంతో ముందుకు సాగాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో చింతలపూడి మండల అధ్యక్షులు కోల వెంకన్న చింతలపూడి కాపు సంఘ గౌరవ సలహాదారులు కొత్త పూడి శేషగిరిరావు గౌరవ అధ్యక్షులు తోట శివ నాగరాజు (నాని) మాజీ అధ్యక్షులు గంధం చంటి, మంచనపల్లి రాఘవేంద్రరావు, ట్రెజరర్ తోట పూర్ణ, కృష్ణమోహన్ కోట శ్రీను, బొల్లంశంకర్, కురిసెట్టి శీను కాపు నాయకులు పాల్గొన్నారు.




