Chintalapudi: చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్‌కు వీఆర్ఏల మొర
Chintalapudi: చింతలపూడి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్‌ను కలిసి వీఆర్ఏ సంఘ సభ్యులు తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
Chintalapudi: చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్‌కు వీఆర్ఏల మొర
ఏలూరు జిల్లా: చింతలపూడి నియోజకవర్గానికి చెందిన వీఆర్ఏల సంఘ సభ్యులు సోమవారం శాసనసభ్యుల వారి క్యాంపు కార్యాలయంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘ సభ్యులు తమ సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం అందజేశారు. వీఆర్ఏల పే స్కేల్ పెంపు, అర్హత కలిగిన వారికి ప్రమోషన్లు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
వారి సమస్యలను శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ గారు సానుకూలంగా విని, సంబంధిత అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.




