Chintoor: డిసెంబర్‌లో చింతూరు ప్రీమియర్ లీగ్ (CPL-3) ప్రారంభం!

Chintoor: చింతూరులో ఐపీఎల్ తరహాలో సీపీఎల్-3 క్రికెట్ టోర్నమెంట్. డిసెంబర్‌లో ప్రారంభం, వైట్ లెదర్ బాల్ లీగ్స్‌కు వేలం పాట ద్వారా ఆటగాళ్ల ఎంపిక.

RAJESH REDDY, CHINTOOR
Published on: 15 Sept 2026 11:10 AM IST
Chintoor
X

Chintoor: డిసెంబర్‌లో చింతూరు ప్రీమియర్ లీగ్ (CPL-3) ప్రారంభం!

Chintoor: చింతూరు ప్రీమియర్ లీగ్ సి పి ఎల్ 3 క్రికెట్ టోర్నమెంట్ డిసెంబర్ నెలలో ప్రారంభం కానున్నది అని అసోసియేషన్ కమిటీ సభ్యులు తెలిపారు.ఈ టోర్నమెంట్ ఐపీఎల్ తరహాలో వైట్ లెదర్ బాల్ తో లీగ్స్ పద్ధతిలో నిర్వహించబడుతుందని నిర్వాహకులు తెలిపారు. టోర్నమెంట్ లో 12 టీమ్స్ కు మాత్రమే అవకాశం ఉంటుందని తెలియజేశారు. ఈ టోర్నమెంట్ లో పాల్గొనే క్రీడాకారులు పోలవరం జిల్లాకు చెందిన వారు మాత్రమే పాల్గొనాలని సూచించారు. టోర్నమెంట్ ఆడదలచిన క్రీడాకారులు అప్లికేషన్ పెట్టి వారి పేరు నమోదు చేసుకున్న తర్వాతనే క్రీడాకారులకు ఈ టోర్నమెంట్ లో ఆడే అవకాశం ఉంటుందని తెలిపారు.

టోర్నమెంట్ లో ప్లేయర్స్ వేలంపాట,ఆన్లైన్ స్కోరింగ్ ఉంటుందని తెలిపారు. ప్రతి జట్టు సొంత క్రికెట్ కిట్ ను కలిగి ఉండాలని, ఈ లీగ్ లో పాల్గొనదలచిన టీమ్స్ ఈనెల 30వ తేదీ లోగా దరఖాస్తు నమోదు చేసుకోవాలని తెలియజేశారు. అలాగే క్రీడాకారులు కూడా అప్లికేషన్ ఈనెల 16వ తేదీ నుండి అక్టోబర్ 14వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. క్రీడాకారుల వేలంపాట అనంతరం ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ డిసెంబర్ లో ప్రారంభం కానున్నదని తెలిపారు.

ఈ టోర్నమెంట్ పోలవరం జిల్లా ఏజెన్సీలోని క్రీడాకారుల ప్రతిభను వెలుగు తీయడానికి ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ టోర్నమెంట్ లో పాల్గొనదలచిన వారు 7995885866, 8179340124,8985277587,7036643324 నెంబర్ లను సంప్రదించాలని తెలిపారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR