Chintoor: చింతూరులో ఘనంగా ఉచిత మట్టి గణపతుల పంపిణీ!

Chintoor: చింతూరు శ్రీ భాస్కర విద్యానికేతన్ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతుల పంపిణీ. పాల్గొన్న డిఎఫ్‌ఓ రవీంద్రనాథ్ రెడ్డి, సీఐ గోపాలకృష్ణ.

RAJESH REDDY, CHINTOOR
Published on: 13 Sept 2026 6:29 PM IST
Chintoor
X

Chintoor: చింతూరులో ఘనంగా ఉచిత మట్టి గణపతుల పంపిణీ!

Chintoor: చింతూరు పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని చింతూరు డిఎఫ్ఓ రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. గణపతి నవరాత్రుల సందర్భంగా ఆదివారం చింతూరులోని శ్రీ భాస్కర విద్యానికేతన్ ఆధ్వర్యంలో మట్టి గణపతి ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ పంపిణీ కార్యక్రమంలో డిఎఫ్ఓ పాల్గొని ప్రసంగించారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వలన పర్యావరణానికి చాలా ముప్పు వాటిల్లుతుందని కావున మట్టి గణపతి విగ్రహాలనే వినాయక చవితి పండుగకు ప్రతి ఒక్కరు వినియోగించాలని సూచించారు. చింతూరు సిఐ గోపాలకృష్ణ మాట్లాడుతూ మట్టితో తయారు చేసిన గణపతి ప్రతిమలు వల్ల పర్యావరణానికి ఎటువంటి నష్టం ఉండదని అన్నారు. విద్యార్థులకు చిన్నప్పటి నుండే పర్యావరణం మీద అవగాహన కల్పించాలని కోరారు.

తదుపరి ఎస్సై సంతోష్ కుమార్ మాట్లాడుతూ పండుగలు శాంతియుతంగా సాంప్రదాయంగా జరుపుకోవాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు తమ పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ముందుంటామని శ్రీ భాస్కర విద్యానికేతన్ కరస్పాండెంట్ చిరసాని వేణుగోపాల్ అన్నారు.ఈ కార్యక్రమంలో ఎకడమిక్ కోఆర్డినేటర్ త్రివీణ, ప్రిన్సిపాల్ రాంబాబు, ఉపాధ్యాయులు రమేష్, గణేష్, విద్యార్థులు పాల్గొన్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR