Chintoor: చింతూరు ఐటీడీఏ పీఓ శుభం నొక్వాల్‌కు ఘన సన్మానం!

Chintoor: చింతూరు ఐటీడీఏ పీఓ, సబ్ కలెక్టర్ శుభం నొక్వాల్‌కు ఘన వీడ్కోలు పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారంలో విశేష కృషి సత్కరించిన తెలుగు యువత నేత వల్లభనేని చందు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 1 Oct 2026 10:43 PM IST
Chintoor
X

Chintoor: చింతూరు ఐటీడీఏ పీఓ శుభం నొక్వాల్‌కు ఘన సన్మానం!

చింతూరు: చింతూరు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి, సబ్ కలెక్టర్ శుభం నొక్వాల్ సేవలు అమోఘమని రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి వల్లభనేని చందు అన్నారు.బదిలీ పై వెళుతున్న సందర్భంగా శుభం నొక్వాల్ కు ఏర్పాటుచేసిన వీడ్కోలు సభకు చందు హాజరయ్యారు. పోలవరం ప్రాజెక్టు వలన ముంపునకు గురవుతున్న నిర్వాసితుల పరిహారం, పునాలవాసం కల్పనలో శుభం నొక్వాల్ ప్రత్యేక శ్రద్ధ చూపారని అన్నారు.

పరిహారం పునరావాసం పై నిజాయితీగా విధులు నిర్వహించారని కొనియాడారు. విలీన మండలాల్లో నెలకొన్న సమస్యలను సత్వర పరిష్కారానికి ప్రయత్నించారని తెలిపారు. శుభం నొక్వాల్ ను శాలువాతో సన్మానించి సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎటపాక మండల టిడిపి ప్రధాన కార్యదర్శి కణితి మధు పాల్గొన్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR