Chintoor: ముకునూరు సర్పంచ్‌గా జనసేన అభ్యర్థి నాగరాజు ఘన విజయం
Chintoor: ముకునూరు పంచాయతీ సర్పంచ్‌గా జనసేన అభ్యర్థి పాయం నాగరాజు 146 ఓట్ల మెజారిటీతో గెలిచారు. జనసైనికుల శ్రమతో విజయం. గ్రామంలో సంబరాలు.
Chintoor: ముకునూరు సర్పంచ్‌గా జనసేన అభ్యర్థి నాగరాజు ఘన విజయం
చింతూరు: ఈరోజు ఉదయం నుంచి ముకునూరులో ఎన్నికల వేడి రాజుకుంది. ఉదయం మొదలైన పోలింగ్ ఒంటిగంట వరకు ఉత్కంఠభరితంగా సాగింది. ఓటు వేయడానికి క్యూ కట్టిన జనం... ప్రతి ఒక్కరి మదిలో ఒకటే ప్రశ్న... “ఈసారి ముకునూరులో జెండా ఎవరిది?”.
ఒంటిగంటకు పోలింగ్ ముగిసింది. రెండు గంటల నుంచి అధికారులు కౌంటింగ్ మొదలుపెట్టగానే టెన్షన్ పీక్స్‌కు చేరింది. ఒక్కో రౌండ్ ఫలితం వస్తున్న కొద్దీ జనసైనికుల గుండెల్లో వేగం పెరిగింది.మొదట్లో నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరు... క్రమంగా నాగరాజు వైపు తిరిగింది. చివరి రౌండ్‌లో సంచలనం! జనసేన తరఫున బరిలో దిగిన పాయం నాగరాజు 146 ఓట్ల మెజారిటీతో విజయ దుందుభి మోగించారు.
ఆ క్షణం ముకునూరులో జనసేన జెండా రెపరెపలాడింది. జనసైనికుల్లో ఉత్సాహం పెల్లుబికింది. డప్పుల మోత, కేరింతలు, పూల వర్షంతో నాగరాజును భుజాలపై ఎత్తుకుని ఊరేగించారు.పంచాయతీ పరిధిలో విస్తృతంగా ప్రచారం చేసి, ఇంటింటికి తిరిగి ప్రజలను కలుపుకున్న నాగరాజు కృషికి... జనసైనికులు పడిన శ్రమే ఈ విజయానికి నాంది పలికింది.తనకు పట్టం కట్టిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన నాగరాజు... “మీ నమ్మకాన్ని వమ్ము చేయను. పంచాయతీ పరిధిలోని ప్రతి సమస్య పరిష్కారానికి నిత్యం కృషి చేస్తాను. ముకునూరును అభివృద్ధి బాటలో నడిపిస్తాను” అని శపథం చేశారు.




