Eluru: గోదావరి పుష్కరాలు-2027 ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష

Eluru: గోదావరి పుష్కరాలు-2027 ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష; ఘాట్లు, రోడ్లు, రవాణా, భద్రతపై చర్చ, ఏలూరు ప్రతిపాదనలు వివరించిన కలెక్టర్ వెట్రిసెల్వి.

Akkineni Venkata Satya Prasad, Nuzvid
Published on: 21 Nov 2026 11:33 PM IST
Eluru
X

Eluru: గోదావరి పుష్కరాలు-2027 ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష

ఏలూరు: గోదావరి పుష్కరాలు -2027 ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సంబంధిత శాఖల మంత్రులు,ప్రభుత్వ కార్యదర్సులతో కలిసి ఆయా జిల్లాల కలెక్టర్లతో శనివారం సాయంత్రం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

గోదావరి పుష్కరాల సందర్భంగా స్నాన ఘాట్ల ఏర్పాట్లు,ఘాట్లలో మౌలిక సదుపాయాలు,ఆయా ప్రాంతాలలో రోడ్ల అభివృద్ధి, రవాణా,భద్రత,పర్యాటకాభివృద్ధి,ఆధ్యాత్మికత,తదితర ఏర్పాట్లకు సంబంధించి వివిధ శాఖల ఉన్నతాధికారులు సమర్పించిన ప్రతిపాదనల పై సమీక్షించారు.

ఏలూరు జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి గోదావరి పుష్కరాల సందర్భంగా జిల్లాలో స్నాన ఘట్టాల గుర్తింపు,పుష్కరాలు జరిగే ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలు,చేపట్టిన పనులు,తదితర అంశాలను ముఖ్యమంత్రికి వివరించారు.

Akkineni Venkata Satya Prasad, Nuzvid

Akkineni Venkata Satya Prasad, Nuzvid