Chintoor: చింతూరు ఏజెన్సీలో కలెక్టర్ దినేష్ కుమార్ పర్యటన!

Chintoor: చింతూరు ఏజెన్సీలో గోదావరి, శబరి నదుల వరద ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ పర్యటించారు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 1 Aug 2026 9:53 AM IST
Chintoor
X

Chintoor: చింతూరు ఏజెన్సీలో కలెక్టర్ దినేష్ కుమార్ పర్యటన!

Chintoor: చింతూరు ఏజెన్సీలో గోదావరి,శబరి నదులు ఉప్పొంగి ప్రవహించడంతో లోతట్టు ప్రాంత ప్రజలు జలమయంలో చిక్కుకున్నారు.కూనవరం మండలం శబరి కొత్తగూడెం, వి ఆర్ పురం శ్రీరామగిరి వరద ప్రభావిత ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా లోతట్టు ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

గోదావరి–శబరి నదుల వరదల ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల పరిస్థితిని ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా శబరికొత్తగూడెంలో ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంపును కలెక్టర్ సందర్శించి బాధితులకు అందిస్తున్న ఆహారం, తాగునీరు, పడకలు, పారిశుధ్య సౌకర్యాలు తదితర ఏర్పాట్ల పై ఆరా తీశారు.క్యాంపులో ఉన్న ప్రతి కుటుంబానికి అవసరమైన సహాయం సమయానికి అందేలా

చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.అనంతరం ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును పరిశీలించి బాధితులకు అందిస్తున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జ్వరాలు, చర్మవ్యాధులు, నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. అవసరమైన మందులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, తాగునీటి శుద్ధి మాత్రలు సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

రిలీఫ్ క్యాంపును కలెక్టర్ సందర్శించి బాధితులకు అందిస్తున్న ఆహారం, తా అందిస్తున్న వైద్య సేవల వివరాలను తెలుసుకున్నారు. వరదల అనంతరం వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. వరరామచంద్రపురం మండలంలోని లోతట్టు ప్రాంతమైన శ్రీరామగిరిలో కలెక్టర్ పర్యటించి బాధితులతో మాట్లాడారు.వరద పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు పాటించాలని ఆయన కోరారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR

Next Story