Chintoor: బాధితులకు భరోసా కల్పిస్తున్న కలెక్టర్ దినేష్ కుమార్!
Chintoor: చింతూరు ఏజెన్సీలో గోదావరి, శబరి వరద ముంపు ప్రాంతాల్లో నిరంతరం పర్యటిస్తూ బాధితులకు అండగా నిలుస్తున్న కలెక్టర్ దినేష్ కుమార్.
Chintoor: బాధితులకు భరోసా కల్పిస్తున్న కలెక్టర్ దినేష్ కుమార్!
Chintoor: పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో గోదావరి శబరి వరదలు ఉగ్రరూపం దాల్చి లోతట్టు ప్రాంత గ్రామాలను ముంచెత్తాయి. చింతూరు ఏజెన్సీలో వరద ఉధృతి మొదలైనప్పటి నుండి కలెక్టర్ దినేష్ కుమార్ వరద ముంపు ప్రాంతాల్లోనే పర్యటిస్తూ బాధితులకు అండగా నిలబడ్డారు. ఎప్పటికప్పుడు వరద ఉధృతి పై అధికారులను అప్రమత్తం చేస్తూ వరద బాధితులకు సమాచారం చేర వేస్తున్నారు.
అలాగే ముంపునకు గురైన బాధితులకు పునరావాసం కల్పించి వారికి అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముంపు ప్రాంతాలలో అత్యవసర వైద్య సేవలు, మంచినీటి సరఫరా అందిస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో కలెక్టర్ పర్యటిస్తూ బాధితులకు అండగా నిలబడడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Next Story




