Chintoor: ప్రత్యేక అధికారులను నియమించిన కలెక్టర్ దినేష్ కుమార్!

Chintoor: చింతూరు ఏజెన్సీలో గోదావరి, శబరి వరదలు తగ్గిన నేపథ్యంలో పునరుద్ధరణ పనులపై ప్రత్యేక అధికారులను నియమించిన కలెక్టర్ దినేష్ కుమార్.

RAJESH REDDY, CHINTOOR
Published on: 2 Aug 2026 11:45 AM IST
Chintoor
X

Chintoor: ప్రత్యేక అధికారులను నియమించిన కలెక్టర్ దినేష్ కుమార్!

Chintoor: గోదావరి, శబరి నదుల వరదల ప్రభావంతో చింతూరు ఏజెన్సీలోని లోతట్టు గ్రామాలు జలమయం అయ్యాయి. వరదల వలన ముంపు ప్రజలు నానా అవస్థలు పడాల్సి వచ్చింది. గోదావరి శబరి నదులు శాంతించడంతో లోతట్టు ప్రాంతాల్లో ముంపు తొలుగుతుంది. దీంతో ముంపు ప్రాంతాలలో పునరుద్దరణ పనుల పై జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ప్రత్యేక అధికారులను నియమించారు.

34 మంది నోడల్ అధికారులు,11 మంది పర్యవేక్షణ అధికారులతో పునరుద్ధరణ పనుల పై ప్రత్యేక దృష్టి పెట్టారు.వరద తగ్గిన అనంతరం పారిశుధ్యం, ప్రజా ఆరోగ్యం మరియు మౌలిక సదుపాయాల పునరుద్ధరణ పనులు వేగవంతంగా అమలు చేస్తారు. ఈ ప్రత్యేక అధికారులు క్షేత్ర స్థాయిలో పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకునే వరకు అందుబాటులో ఉండాలి.పర్యవేక్షణలో నిర్లక్ష్యం లేదా వైఫల్యం కనబడితే సంబంధిత అధికారుల పై అమలులో ఉన్న నిబంధనల ప్రకారం కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు.

ముంపు గ్రామాల్లో బురద, చెత్త తొలగింపు, రహదారుల శుభ్రపరిచే పనులు, తాగునీటి వనరుల శుద్ధి, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, క్లోరినేషన్, ఫాగింగ్, వైద్య శిబిరాలు, వ్యాధి పర్యవేక్షణ, విద్యుత్ మరియు కమ్యూనికేషన్ సదుపాయాల పునరుద్ధరణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR

Next Story