Eluru: గోదావరి వరద ఉధృతి.. అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు!
Eluru: కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో గోదావరి వరద సహాయక చర్యలను, ఎన్డీఆర్ఎఫ్ బృందాల మోహరింపును కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులతో సమీక్షించారు.
Eluru: గోదావరి వరద ఉధృతి.. అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు!
ఏలూరు: ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో వరదల కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టాలు కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.
వేలేరుపాడు తహసీల్దార్ కార్యాలయంలో శనివారం వరద పరిస్థితి, పునరావాస చర్యలపై జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిశోర్, ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, జాయింట్ కలెక్టర్ ఎం.జె.అభిషేక్ గౌడ, అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్. శ్రావణ్ కుమార్ రెడ్డి లతో కలిసి అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో గోదావరి వరదలు కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని 28 గ్రామాలలోని 8492 ప్రజలపై ప్రభావం చూపాయన్నారు. ముంపు గ్రామాలలోని ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.
వరద ముంపు ప్రమాదం ఉన్న గ్రామాలలోని ప్రజలను వరద పునరావాస కేంద్రాలకు తరలించి భోజన, వసతి సదుపాయాలు కాళోంచాలన్నారు. కుక్కునూరు మండలంలో ఒకటి, వేలేరుపాడు మండలంలో ఒక వరద పునరావాస కేంద్రం ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. కేంద్ర విపత్తు నివారణ దళానికి చెందిన 25 మంది సభ్యులతో కూడిన బృందాన్ని వేలేరుపాడు మండలానికి, రాష్ట్ర విపత్తు నివారణ దళానికి చెందిన 25 మంది సభ్యులతో కూడిన బృందాన్ని కుక్కునూరు కు పంపి ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
రెండు మండలాలకు సంబంధించి 15 బొట్లు, 2 లాంచీలు, గజ ఈతగాళ్లని సహాయక కార్యక్రమాలకు సిద్ధం చేయడం జరిగిందన్నారు. వరద బాధిత కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీకి చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. . పునరావాస కేంద్రాలకు 44 కుటుంబాలను తరలించడం జరిగిందని, వరద బాధితులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని, పరిసరాలలో పూర్తి పారిశుద్ధ్య పరిస్థితులు ఉండేలా చూడాలని, రక్షిత త్రాగునీరు అందించాలన్నారు. దోమలు, అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పునరావాస కేంద్రాలు, ముంపు గ్రామాలలో మెడికల్ క్యాంపులు ఏర్పాటుచేయాలని, గర్భిణీలను దగ్గరలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు తలరించాలన్నారు.
వయోవృద్ధులు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారిని దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించాలన్నారు. వైద్య కేంద్రాలలో మలేరియా, టైఫాయిడ్, డయేరియా, పాము కాటు నివారణ మందులను సిద్ధం ఉంచాలన్నారు. వరద ముంపు తొలగే వరకు అధికారులు వరద సహాయక విధులలో సక్రమంగా నిర్వహించాలన్నారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎం.వి. రమణ, డిఆర్డిఏ పీడీ విజయలక్ష్మి, డిఎంహెచ్ఓ డా. శోభ, తహసీల్దార్ ఎన్ . శ్రీనివాస్, ప్రభృతులు పాల్గొన్నారు.




