Amalapuram: పాల ఉత్పత్తిలో జిల్లాను రాష్ట్రంలోనే ప్రధమ స్థానంలో నిలపాలి
Amalapuram: అంబేడ్కర్ కోనసీమ జిల్లా పశుసంవర్ధక శాఖ ఇన్చార్జి అధికారిగా ఎల్. విజయా రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
Amalapuram: పాల ఉత్పత్తిలో జిల్లాను రాష్ట్రంలోనే ప్రధమ స్థానంలో నిలపాలి
అమలాపురం: వ్యవసాయ ఆధారిత జిల్లాగా ఉన్న అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆర్థిక వ్యవస్థలో పశుసంవర్ధక శాఖది కీలక పాత్ర అని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు.అంబేడ్కర్ కోనసీమ జిల్లా, పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారిగా ఎల్.విజయా రెడ్డి ఇన్చార్జిగా శనివారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన భవానీ ప్రసాద్ జిల్లా కలెక్టర్ వారికి సహాయ సంచాలకులు ఎల్ విజయారెడ్డి పరిచయం చేసి పశు సంవర్ధక శాఖ జిల్లా ఇన్చార్జిగా నియమించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన భవానీప్రసాద్ తో కలిసి జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వారిని మర్యాద పూర్వకంగా కలవగా జిల్లా కలెక్టర్ స్వాగతించారు నూతన అధికారి తన అనుభవంతో కోనసీమ దాన తదితర కార్యక్రమాల ద్వారా పాడి రైతులకు అండగా నిలుస్తారని ఆశిస్తున్నానన్నారు. జిల్లాలో పశుగణా భివృద్ధి మరియు పాడి రైతుల సంక్షేమం దృష్ట్యా అనుసరించాల్సిన పనితీరుపై జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.
ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి రైతుకు చేరేలా విధి నిర్వహణలో అత్యంత పారదర్శకతను పాటించాలని, క్షేత్రస్థాయి సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ జవాబుదారీతనంతో పనిచేయాలని సూచించారు. పశువైద్యసేవలు కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా, రైతులకు చేరువుగా శాఖపరమైన సేవలను మారుమూల గ్రామాల్లోని పాడి రైతుల ముంగిటకే చేర్చాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా మొబైల్ వెటర్నరీ క్లినిక్ల వినియోగాన్ని పెంచాలని ఆదేశించారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో పశువులకు సంభవించే గాలికుంటు వ్యాధి వంటి ప్రమాదకర వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, టీకాల పంపిణీ కార్యక్ర మాన్ని యుద్ధప్రతిపాదికన చేపట్టాలని సూచించారు. జిల్లా యంత్రాంగంతో కలిసి పనిచేస్తూ, పశుగ్రాసం, దానా కొరత లేకుండా చూడటం మరియు పాల ఉత్పత్తిలో జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు. అదేవిధంగా జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నిధియా దేవి వారిని మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ కార్యక్రమంలో ఉపసంచాలకులు కే. చంద్రశేఖర్ రెడ్డి, సిబ్బంది వినోద్ తదితరులు పాల్గొన్నారు.




