Eluru: ఏలూరు జిల్లాలో నేటి నుంచి ఓటర్ల ఇంటింటి పునఃపరిశీలన!

Eluru: ఏలూరు జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేందుకు మరియు ఏఎస్‌డీడీ ఓటర్ల జాబితా పరిశీలనకు నేటి నుంచి ఇంటింటి ప్రత్యేక డ్రైవ్.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 8 Oct 2026 7:30 AM IST
Eluru
X

Eluru: ఏలూరు జిల్లాలో నేటి నుంచి ఓటర్ల ఇంటింటి పునఃపరిశీలన!

Eluru: అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటర్ల జాబితాలో చేర్చేందుకు నేటి నుండి ఏలూరు జిల్లాలో ఇంటింటికీ వెళ్లి ఓటర్ల స్థితిని పునఃపరిశీలిస్తారని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు.

ASDD ఓటర్ల వెరిఫికేషన్: 'ప్రత్యేక సమగ్ర సవరణ -2026'లో భాగంగా గైర్హాజరైన,స్థానచలనం చెందిన,మరణించిన లేదా ద్వంద్వ నమోదు కలిగిన (ASDD) ఓటర్ల వివరాలను బిఎల్వోలు (BLOs) క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు.ఇప్పటికే తొలగించిన ఓటర్ల జాబితాను పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు.

ఒకవేళ ఎవరిదైనా పేరు పొరపాటున తొలగించబడితే,వారు 'ఫారం-6' ద్వారా తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చు,అక్టోబర్ 16న జిల్లాలో తుది ఓటర్ల జాబితా ప్రచురించబడుతుంది అని తుది జాబితాలో పేరు లేని వారు లేదా కొత్తగా అర్హత సాధించిన వారు 'నిరంతర అప్‌డేషన్' ప్రక్రియ ద్వారా ఎప్పుడైనా 'ఫారం-6' సమర్పించి తమ పేరును నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్