Eluru: తుఫాన్లను తట్టుకునే ప్రకృతి వ్యవసాయం చేయాలి..కలెక్టర్!

Eluru: తుఫాన్లను తట్టుకుని నిలబడే ప్రకృతి వ్యవసాయాన్ని రైతులు అనుసరించాలని ఏలూరు కలెక్టర్ కె. వెట్రిసెల్వి కోరారు. దెందులూరు మండలం పోతునూరులో పంట పొలాలను పరిశీలించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 15 Nov 2026 7:55 AM IST
Eluru
X

Eluru: తుఫాన్లను తట్టుకునే ప్రకృతి వ్యవసాయం చేయాలి..కలెక్టర్!

Eluru: ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగుచేసిన వరి పొలాలలో వరి మొక్కలు తుఫాన్లను తట్టుకుని నిలబడ్డాయని రైతులు ప్రకృతి వ్యవసాయం చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు. దెందులూరు మండలం పోతునూరులో ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగుచేసిన పొలాలను శనివారం అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ఇటీవల తుఫాన్లు, భారీ వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాలను ప్రకృతి సాగు చేసిన వరి మొక్కలు తట్టుకుని నిల్చున్నాయని,ఈ విషయంపై రైతులకు అవగాహన కలిగించి రైతులను ప్రకృతి సాగువైపు ప్రోత్సహించేలా వ్యవసాయాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

రైతు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించాలని కోరారు. ఈ సందర్భంగా రైతుల పంట పొలాలను పరిశీలించి,వారి సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాషా, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్